Mana Enadu : తెలుగు రియాల్టీ షోస్ కా బాప్ బిగ్ బాస్ (Bigg Boss 8 Telugu). ఈ షో ఎనిమిదో సీజన్ ముగింపునకు వచ్చేసింది. ఇవాళ ఫినాలే ఎపిసోడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. టాప్ 5 కంటెస్టెంట్లు గౌతమ్, నిఖిల్, ప్రేరణ, నబీల్, అవినాష్.. టైటిల్ కోసం ఫైట్ చేస్తున్నారు. టాప్-5కి వచ్చారంటేనే టైటిల్ గెలిచినట్లు అయినా.. అసలైన టైటిల్ కొట్టి ప్రైజ్ మనీ తీసుకెళ్లేది ఎవరోనని వ్యూయర్స్ తెగ ఎదురుచూస్తున్నారు. అయితే టాప్-5లో ఉన్న వారిలో గౌతమ్, నిఖిల్ (Nikhil Bigg Boss).. టైటిల్ రేసులో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు ఈ సీజన్ కు కచ్చితంగా లేడీ కంటెస్టెంటే విన్నర్ అవుతారనే ఊహాగానాలూ వినిపిస్తున్నాయి.
బిగ్ బాస్ 8 ప్రైజ్ మనీ ఎంతంటే..?
ఇక ఇవాళ (ఆదివారం) జరగబోయే బిగ్ బాస్-8 గ్రాండ్ ఫినాలే (Bigg Boss 8 Grand Finale)లో ఆడియెన్స్ ను ఆకట్టుకునే పర్ఫామెన్స్సెస్ ఉండబోతున్నట్లు సమాచారం. ఫినాలే ఎపిసోడ్ కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan Bigg Boss 8) గెస్టుగా రాబోతున్నట్లు తెలిసింది. ఇక తాజాగా బిగ్ బాస్ టీమ్ ఫినాలేకు సంబంధించి ఓ ప్రోమోను రిలీజ్ చేసింది. ఈ ప్రోమోలో హోస్టు నాగార్జున ఈ సీజన్ కు సంబంధించిన ప్రైజ్ మనీ ఎంతో రివీల్ చేశారు. అది చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. గత సీజన్లలో ఎప్పుడూ లేనంతగా ఈ సీజన్ ప్రైజ్ మనీ ఉందంటూ నెట్టింట చర్చ మొదలైంది. ఇంతకీ ఈ సీజన్ ప్రైజ్ మనీ ఎంతంటే..?
అన్లిమిటెడ్ ప్రైజ్ మనీ
అన్లిమిటెడ్ ఫన్, అన్లిమిటెడ్ ట్విస్టులు అంటూ మొదలైన బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 కాన్సెప్ట్ అన్లిమిటెడ్. మరి ఈ సీజన్ లో ప్రైజ్ మనీ కూడా అన్ లిమిటెడ్ అని హోస్టు నాగార్జున సీజన్ మొదలైనప్పుడే చెప్పారు. గత ఏడు సీజన్లలో బిగ్‌బాస్ తెలుగు టైటిల్ విన్నర్‌కు దాదాపుగా రూ. 50 లక్షల వరకు ప్రైజ్ మనీ వచ్చింది. ఈ సీజన్లో మాత్రం కాస్త డిఫరెంటుగా కంటెస్టెంట్ల ఆట తీరును బట్టి ప్రైజ్ మనీ ఉంటుందని నాగ్ తెలిపారు. అంటే ఎంత సంపాదించుకుంటే అంత అన్నమాట.
భారీ ప్రైజ్ మనీ ప్లస్ మారుతీ కార్
ఆ లెక్క ప్రకారమే షో మొదలైన రోజు నుంచి నేటి వరకు ప్రైజ్‌మనీ (Bigg Boss 8 Prize Money) పెంచుకునేందుకు కంటెస్టెంట్లకు బిగ్ బాస్ వివిధ రకాల గేమ్స్ పెట్టాడు. అలా బిగ్ బాస్ ఇచ్చిన ఆటల్లో కంటెస్టెంట్లు రూ.54 లక్షల 30 వేల ప్రైజ్ మనీ సంపాదించారు. ఇక ఫినాలే వీక్‌లో బీబీ పరివారానికి, మా పరివారానికి (Maa Parivaar) పెట్టిన గేమ్సులో బీబీ పరివారం గెలిచి ప్రైజ్ మనీ మరింత పెంచుకుంది. తాజాగా ఈ ప్రైజ్ మనీని నాగార్జున (Nagarjuna) రివీల్ చేశారు. ఫినాలే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలో .. మొత్తం ప్రైజ్ మనీ రూ.54,99,999 ఉండగా.. మరో రూపాయి యాడ్ చేసి రూ.55 లక్షలు చేసినట్లు నాగ్ చెప్పారు. ఈ సీజన్ విన్నర్ మారుతి కార్ కూడా దక్కించుకోనున్నట్లు వెల్లడించారు.







