Mana Enadu : తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 8 (Bigg Boss 8) ముగింపునకు చేరుకుంది. ఇవాళే ఈ సీజన్ చివరి ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో బిగ్‌బాస్ షో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సీజన్ విజేత (Bigg Boss 8 Winner)ను ఇవాళ (ఆదివారం) ప్రకటించనున్నారు.
అన్నపూర్ణ స్టూడియో వద్ద బందోబస్తు
గతేడాది డిసెంబరు 17వ తేదీన బిగ్‌బాస్-7 విజేతగా పల్లవి ప్రశాంత్ (Pallavi Prashant)ను ప్రకటించిన తర్వాత ఆయన స్టూడియో నుంచి బయటకు వచ్చాక అభిమానుల అత్యుత్సాహంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ క్రమంలో ఏడు ఆర్టీసీ బస్సులు, పలు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ పరిస్థితులు ఈ సీజన్ 8లో పునరావృతం కాకుండా ఉండేందుకు పోలీసులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసేందుకు పశ్చిమ మండల పోలీసులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈసారి పోలీసులు ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
సీజన్-8 విన్నర్ అతడే
ఇక సీజన్-8లో గతంలో ఎన్నడూ చూడని ట్విస్టులు, మలుపులతో ఈ సీజన్ రసవత్తరంగా సాగుతూ వచ్చింది. ఇక చివరి వారం రోజుకో గెస్టు వచ్చి హౌసులో సందడి చేశారు. హౌస్ మేట్స్ తో ఆసక్తికరమైన గేమ్స్ ఆడించారు. అయితే ఇవాళ్టితో ముగియనున్న ఈ సీజన్ విన్నర్ (Bigg Boss 8 Winner) ఎవరనే దానిపై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. బిగ్ బాస్ సీజన్-8 విన్నర్ అతడే అంటూ నెట్టింట ప్రచారం నడుస్తోంది.
ఈసారి లేడీ లక్ పని చేస్తుందా?
ఈ సీజన్ చివరిలో టాప్-5 కంటెస్టంట్లలో గౌతమ్, నిఖిల్ (Nikhil), ప్రేరణ, నబీల్, అవినాష్ ఉన్నారు. ఈ ఐదుగురు మొదటి నుంచి తమ బెస్ట్ ఇస్తూ వస్తున్నారు. అయితే టైటిల్ రేసులో మాత్రం నిఖిల్, గౌతమ్ ఉన్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు ఈసారి లేడీ కంటెస్టెంట్ ప్రేరణ (Prerana Bigg Boss)యే విన్నర్ అంటూ న్యూస్ వైరల్ అవుతోంది.
మరికొన్ని గంటల ఎదురుచూపులు
లేదు లేదు.. మొదటి నుంచి తన ఆటతో ఆకట్టుకుంటున్న నబీల్ విజేత అంటూ ఇంకొందరు.. తన కామెడీతో గేమ్ లో స్ట్రాటజీస్ తో.. టాస్కుల్లో జోరు చూపించిన అవినాష్ (Bigg Boss 8 Grand Finale) అసలైన విన్నర్ అంటూ సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ బిగ్ బాస్ తెలుగు సీజన్-8 విన్నర్ ఎవరో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.







