Bigg Boss 8: ‘బిగ్ బాస్ సీజన్ 8’ విన్నర్ నిఖిల్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 షో 105 రోజుల జర్నీకి ముగింపు పడింది. ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలే ఈవెంట్‌లో నిఖిల్ విన్నర్‌గా నిలవగా, గౌతమ్ రన్నర్‌గా వెనుదిరిగాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదగా విన్నర్ అయిన నిఖిల్ బిగ్ బాస్ సీజన్ 8 ట్రోఫీని అందుకున్నారు.

ఆదివారం జరిగిన బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే వేడుకను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. హౌస్‌లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్‌లో టాప్ 5 కంటెస్టెంట్‌గా అవినాష్ ఎలిమినేట్ కాగా, అతడిని కన్నడ స్టార్ ఉపేంద్ర హౌస్ నుండి బయటకు తీసుకువచ్చారు. టాప్ 4గా ప్రేరణ బిగ్ బాస్ హౌస్ నుండి వెనుదిరిగారు. ఆమెను ప్రగ్యా జైస్వాల్ హౌస్ నుండి బయటకు తీసుకువచ్చారు. ఇక టాప్ 3లో ఉన్న ముగ్గురు కంటెస్టెంట్స్‌కి నాగార్జున కొంత అమౌంట్‌తో సూట్ కేస్ ఆఫర్ చేయగా ముగ్గురూ రిజిక్ట్ చేశారు. అనంతరం కాపేపటికే నబీల్ ఎలిమినేట్ అయ్యాడు. నబీల్‌ను విజయ్ సేతుపతి హౌస్ నుండి బయటకు తీసుకువచ్చారు.

రామ్ చరణ్ స్టేజ్ మీదకు వచ్చి కాసేపు గేమ్ చేంజర్ ముచ్చట్లను చెప్పారు. తర్వాత ఇద్దరి చేతులు (నిఖిల్, గౌతమ్) పట్టుకుని ఫైనల్‌గా నిఖిల్ చేతిని పైకిత్తి.. ఆయన విన్నర్ అయినట్లుగా నాగార్జున ప్రకటించారు. ఆ తర్వాత పెద్దగా హడావుడి ఏమీ లేకుండానే షో ని ముగించారు.

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Megastar Chiranjeevi: చిరూని కలిసి మహిళా వీరాభిమాని.. రాఖీ కట్టి తీవ్ర భావోద్వేగం 

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వీరాభిమాని రాజేశ్వరి(Rajeshwari), తన ఆరాధ్య నటుడిని కలిసేందుకు సైకిల్‌(Cycle)పై సుదీర్ఘ ప్రయాణం చేసి హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. ఈ సంఘటన చిరంజీవిని ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాక, అభిమానుల హృదయాలను కూడా కదిలించింది. రాజేశ్వరి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *