ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య (vaishnavi chaitanya) కాంబోలో వచ్చిన ‘బేబీ (Baby)’ సినిమా సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. సాయి రాజేశ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తో పాటు కలెక్షన్ల వర్షం కురిపించింది. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై గోవర్ధన మారుతీ, ఎస్కేఎన్ నిర్మించిన ఈ చిత్రం.. రిలీజ్ కు ముందు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టింది.
ఆదిత్య హాసన్ తో బేబీ కాంబో
ఇక ఈ సినిమాలో ఆనంద్ (Anand Devarakonda), వైష్ణవి మధ్య కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. ఈ జంట మరోసారి కలిసి నటిస్తే చూడాలని ప్రేక్షకులు కోరుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సినీ లవర్స్ కు గుడ్ న్యూస్. ఈ హిట్ పెయిర్ మరో హిట్ కొట్టేందుకు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈటీవీ విన్ లో గతేడాది రిలీజ్ అయి సెన్సేషనల్ హిట్ కొట్టిన ‘#90 (90’s Middle Class)’ వెబ్ సిరీస్ దర్శకుడు ఆదిత్య హాసన్ వైష్ణవి, ఆనంద్ రెండో సినిమాకు దర్శకత్వం వహించనున్నారట.
ఓ రెండు మేఘాలిలా
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమాను నాగవంశీ నిర్మించనున్నారని సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించనున్నారట. ఈ చిత్రానికి ‘ఓ రెండు మేఘాలిలా (O Rendu Meghalila)’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు తెలిసింది. బేబీ సినిమాలో ఓ రెండు ప్రేమ మేఘాలిలా అనే పాట ఎంత హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు ఆ పాట లిరిక్ ను ఈ జంట నటిస్తున్న రెండో సినిమా టైటిల్ పెట్టనున్నట్లు వార్తలు రావడంతో ఈ చిత్రం కూడా సూపర్ హిట్ అవ్వడం పక్కా అంటున్నారు నెటిజన్లు.






