సంధ్య థియేటర్ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)కు బిగ్ రిలీఫ్ లభించింది. ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది. ఇప్పటికే ఇరువైపుల వాదనలు ముగియగా న్యాయస్థానం తీర్పును నేటికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయనకు రెగ్యులర్ బెయిల్ (Regular Bail) మంజూరు చేస్తూ తీర్పు వెలువరించడంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఆయన మధ్యంతర బెయిల్పై ఉన్న విషయం తెలిసిందే.
14 రోజుల రిమాండ్
డిసెంబరు నెల 4వ తేదీన సంధ్య థియేటర్ (Sandhya Theatre Case) లో పుష్ప-2 (Pushpa 2) బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకున్న ఘటనలో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ కూడా విధించింది. అయితే ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో మరుసటి రోజే జైలు నుంచి విడుదలయ్యారు.
నాంపల్లి కోర్టు సంచలన తీర్పు
ఇక నాంపల్లి కోర్టు (Nampally Court) విధించిన 14 రోజుల రిమాండ్ డిసెంబరు నెల 27వ తేదీన ముగియడంతో ఆయన న్యాయస్థానం ఎదుట వర్చువల్ గా హాజరయ్యారు. ఆరోజే బన్నీ తరఫు లాయర్లు రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ వాయిదా పడగా సోమవారం రోజున మరోసారి నాంపల్లి కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్, అధికారుల తరఫు లాయర్ల వాదనలు జరిగాయి. ఇరువురి వాదనలు ముగిసిన అనంతరం కోర్టు తీర్పును నేటికి వాయిదా వేయగా ఇవాళ బన్నీకి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.






