సంధ్య థియేటర్ ఘటన.. అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్

సంధ్య థియేటర్ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun)కు బిగ్ రిలీఫ్ లభించింది. ఆయనకు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది. ఇప్పటికే ఇరువైపుల వాదనలు ముగియగా న్యాయస్థానం తీర్పును నేటికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయనకు రెగ్యులర్ బెయిల్ (Regular Bail) మంజూరు చేస్తూ తీర్పు వెలువరించడంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఆయన మధ్యంతర బెయిల్​పై ఉన్న విషయం తెలిసిందే.

14 రోజుల రిమాండ్

డిసెంబరు నెల 4వ తేదీన సంధ్య థియేటర్ (Sandhya Theatre Case) లో పుష్ప-2 (Pushpa 2) బెనిఫిట్‌ షో సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకున్న ఘటనలో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ కూడా విధించింది. అయితే ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో మరుసటి రోజే జైలు నుంచి విడుదలయ్యారు.

నాంపల్లి కోర్టు సంచలన తీర్పు

ఇక నాంపల్లి కోర్టు (Nampally Court) విధించిన 14 రోజుల రిమాండ్‌ డిసెంబరు నెల 27వ తేదీన ముగియడంతో ఆయన న్యాయస్థానం ఎదుట వర్చువల్ గా హాజరయ్యారు. ఆరోజే బన్నీ తరఫు లాయర్లు రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ వాయిదా పడగా సోమవారం రోజున మరోసారి నాంపల్లి కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్, అధికారుల తరఫు లాయర్ల వాదనలు జరిగాయి. ఇరువురి వాదనలు ముగిసిన అనంతరం కోర్టు తీర్పును నేటికి వాయిదా వేయగా ఇవాళ బన్నీకి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *