Chandrababu: తిరుపతి ఘటనపై సీఎం సీరియస్.. ఇద్దరు అధికారుల సస్పెండ్

తిరుపతి(Tirupati)లో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ జారీ కేంద్రాల(Token Issuing Centers) వద్ద తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా, 40 మంది వరకు భక్తులు గాయపడడం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై CM చంద్రబాబు సమీక్షించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై సీరియస్ అయ్యారు. అనంతరం టీటీడీ పరిపాలన భవనంలో సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.
న్యాయ విచారణ జరిపిస్తాం..

“DSP రమణ కుమార్ బాధ్యత లేకుండా పనిచేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన రమణ కుమార్, గోశాల డైరెక్టర్ హరనాథెడ్డిని సస్పెండ్ చేశాం. SP సుబ్బరాయుడు, JEO గౌతమి, CSO శ్రీధర్‌ను తక్షణమే ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాం. ఘటనపై న్యాయ విచారణ జరిపిస్తాం.అలాగే TTD ద్వారా మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తాం. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తాం. తిమ్మక్క, ఈశ్వరమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. వారికి రూ.5 లక్షల చొప్పున సాయం చేస్తాం. గాయపడిన 33 మందికి ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందిస్తాం. బాధలో ఉన్నప్పటికీ స్వామివారి దర్శనం చేసుకోవాలనే సంకల్పం వారిలో ఉంది. 35 మందికి శుక్రవారం వైకుంఠ ద్వార దర్శనం చేయిస్తాం” అని చంద్రబాబు తెలిపారు.

మెరుగైన వైద్యం అందించాలని సూచన

అంతకుముందు క్షతగాత్రులకు తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈమేరకు గురువారం తిరుపతి వచ్చిన సీఎం చంద్రబాబు స్విమ్స్ ఆసుపత్రికి వద్దకు చేరుకుని, అక్కడ చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. వారిని అడిగి తొక్కిసలాట వివరాలు తెలుసుకున్నారు. స్విమ్స్ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *