తిరుపతి తొక్కిసలాట ఘటన(Tirupati stampede incident) రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదని YCP అధినేత, మాజీ సీఎం జగన్(YS Jagan) అన్నారు. తిరుపతి స్విమ్స్ ఆస్పత్రి(Tirupati Swims Hospital)లో బాధితులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియా(Media)తో మాట్లాడారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. వైకుంఠ ఏకాదశి(Vaikuntha Ekadashi) సమయంలో ప్రతి ఏటా భద్రత కల్పిస్తారు. కానీ ఈసారి మాత్రం భద్రత విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలని అలాగే క్షతగాత్రులకు ఉచిత వైద్యం(Free medical care) తోపాటు రూ.5లక్షల పరిహారం(Compensation) ఇవ్వాలని జగన్ డిమాండ్ చేశారు.
అధికారులు, ప్రభుత్వ పెద్దలు బాధ్యత వహించాలి
అంతేకాగు ఈ ఘటనకు TTD అధికారుల నుంచి, ప్రభుత్వ పెద్దలంతా ఈ ఘటనకు బాధ్యత వహించాలన్నారు. వందలాది మంది భక్తులు వస్తారన్న తెలిసికూడా భద్రత కల్పించలేదని ఆరోపించారు. ఆరుగురు చనిపోగా.. 60 మందికి గాయాలయ్యాయన్నారు. తొక్కిసలాటపై సీఎం చంద్రబాబు(CM Chandrababu) అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. ఇంత దారుణంగా వ్యవస్థ మారిపోయిందని జగన్ ధ్వజమెత్తారు. TTD, పోలీసులు కౌంటర్ల వద్ద కనీస ఏర్పాట్లు చేయలేదన్నారు. భక్తులను పట్టించుకోకుండా, Q లైన్లలో నిలబెట్టకుండా, ఒకేచోట గుమిగూడేలా చేశారని విమర్శించారు. ఇంత పెద్ద ఘటన జరిగితే BNS 105(ఉద్దేశపూర్వకంగా మృతికి కారకులు) బదులు తీవ్రత తక్కువగా ఉండే BNS 194 సెక్షన్‌తో కేసులు పెట్టడం దారుణమన్నారు.
#AndhraPradesh | YSRCP chief and former CM YS Jagan Mohan Reddy interacts with victims in #Tirupati
A stampede occurred last night in Tirupati, claiming the lives of 6 people and injuring 40. #TirupatiStampede pic.twitter.com/tg48WhGd64
— The Times Of India (@timesofindia) January 9, 2025






