Rain Alert: పండుగ వేళ వాతావరణశాఖ కీలక అప్డేట్!

పట్టణాలు ఖాళీ అయ్యాయి. నగరాలు వెలవెలబోయాయి. ఇన్నిరోజులు వర్క్ లైఫ్‌(Work Life)తో బిజీబిజీగా గడిపిన వారంతా పల్లెబాట పట్టారు. దీంతో ఎక్కడ చూసినా సంక్రాంతి(Sankranti) సందడే నెలకొంది. మూడు రోజుల పండగను చిరకాలం గుర్తిండిపోయేలా నిర్వహించుకుంటున్నారు. కోడిపందేలు, ఎద్దుల పోటీలు, గాలిపటాలు ఎగరేస్తూ సంతోషంగా ఈ ఫెస్టివల్‌(Festival) నిర్వహించుకునేకుందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ(Department of Meteorology) వర్షాల(Rains)పై బిగ్ అప్డేట్ ఇచ్చింది. రానున్న మూడు రోజులు AP, తమిళనాడు(Tamilnadu)లోని తంజావూరు, తిరువారూర్, నాగపట్నం, మైలాడుతురై, పుదుకోట్టై జిల్లాలు, కారైకల్‌లోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బంగాళాఖాతం(Bay of Begal)లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొంది. దీని ప్రభావంతో సోమ, మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

అక్కడ అలా.. ఇక్కడ ఇలా..

వాతావరణ శాఖ వర్షాల సూచన మేరకు ఆంధ్రప్రదేశ్(Ap), యానం(Yanam)లో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య- తూర్పు గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన ఉన్నట్లు తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో పొడి వాతావరణం ఉంటుందని, అలాగే దక్షిణ కోస్తాంధ్రలో ఈ మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల వానలు పడే ఛాన్సుందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉండగా నెలూరు జిల్లాలో అర్ధరాత్రి నుంచే జోరుగా వర్షం పడుతోంది. మరోవైపు తెలంగాణ(Telangana)లో వాతావరణంలో మార్పులు కనిపిస్తాయని, ఈ మూడురోజులు మబ్బులు రావడంతోపాటు పొగమంచు అధికంగా కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Meteorological Centre) పేర్కొంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *