”సార్ (SIR Movie)’ సినిమా కథను టాలీవుడ్ హీరోకు వినిపించాను. కానీ ఆయన చేయనన్నారు. ధనుశ్ కు చెప్పిన వెంటనే ఓకే చేసేశారు. ‘లక్కీ భాస్క’ర్ కథను టాలీవుడ్ నటుడికి చెబితే.. ఓ పిల్లాడికి తండ్రిగా ఫ్యాన్స్ నన్ను ఒప్పుకోలేరన్నారు. అదే కథను దుల్కర్ సల్మాన్ కు చెప్పగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తెలుగు డైరెక్టర్ అయి ఉండి తమిళ, మలయాళ హీరోలతో ఎందుకు సినిమాలు చేస్తున్నారని చాలా మంది అడుగుతున్నారు. దానికి కారణమేంటో చెప్పడానికి పై రెండు ఉదాహరణలు చాలనుకుంటాను. అని టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి (Venky Atluri) అన్నారు.
ధనుశ్ హానెస్ట్ రాజా
ఆయన ఇప్పటికే కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ (Dhanush)తో సార్ మూవీ, మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తో ‘లక్కీ భాస్కర్ (Lucky Baskhar)’ చేసి సూపర్ హిట్ కొట్టారు. ఇక తన నెక్స్ట్ మూవీ టాలీవుడ్ లో ఎవరైనా స్టార్ హీరోతో ఉంటుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. మళ్లీ వెంకీ అట్లూరి తమిళ హీరోతోనే సినిమా ఓకే చేసినట్లు వార్తలొస్తున్నాయి. అది కూడా సార్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన ధనుశ్ తో. ఈ ఇద్దరి కాంబోలో మరో చిత్రం రాబోతోంది. ‘హానెస్ట్ రాజా (Honest Raja)’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం.
సితార బ్యానర్ లోనే మరో సినిమా
ప్రస్తుతం ధనుశ్ ఇళయరాజా (Ilayaraja) బయోపిక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు స్వీయ దర్శకత్వంలో ‘ఇడ్లీ కడాయి’లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక.. వెంకీ అట్లూరి సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లోనే ఈ సినిమా కూడా నిర్మించనున్నారట. త్వరలో దీనికి సంబంధించి అధికారక ప్రకటన రానుంది.






