అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం

అమెరికా నూతన అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపడుతున్నారు. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 10.30 గంటలకు వాషింగ్టన్‌లోని క్యాపిటల్ భవనంలో ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం ప్రారంభమైంది. అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగిస్తారు.  ‘మా సుస్థిర ప్రజాస్వామ్యం.. ఒక రాజ్యాంగ వాగ్దానం’ (Our Enduring Democracy: A Constitutional Promise) అనేది ఈసారి అమెరికా అధ్యక్షుడి ప్రమాణస్వీకారోత్సవ నినాదం.

ప్రమాణ స్వీకారోత్సవం షెడ్యూల్ ఇదే

  1. మొదట వాషింగ్టన్‌లోని క్యాపిటల్ భవనం వరకు డొనాల్డ్ ట్రంప్ ర్యాలీ
  2. న్యూయార్క్ ఆర్చ్ బిషప్ టిమోథీ కార్డినల్ డోలన్, క్రైస్తవ మత ప్రచారకుడు ఫ్రాంక్లిన్ గ్రాహం ప్రసంగం.
  3. క్రిస్టోఫర్ మాచియో అనే గాయకుడు “Oh, America!” గీతాలాపన.
  4. తొలుత అమెరికా ఉపాధ్యక్షుడిగా తెలుగింటి అల్లుడు జేడీ వాన్స్ ప్రమాణం.
  5. తదుపరి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం.
  6. అనంతరం అమెరికా ప్రజలను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగం.
  7. అనంతరం జో బైడెన్, కమలా హారిస్‌కు గౌరవ వీడ్కోలు.
  8. మెమొరాండమ్లు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై కొత్త అధ్యక్షుడు ట్రంప్ సంతకాలు.
  9. క్యాపిటల్ భవనంలో నూతన అధ్యక్షుడితో కలిసి ప్రముఖుల లంచ్.
  10. నూతన అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు కలిసి సైనిక బలగాల ప్రదర్శన, ప్రెసిడెన్షియల్ పరేడ్‌ల వీక్షణ.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *