జాన్వీ కపూర్(Janhvi Kapoor).. ప్రస్తుతం బాలీవుడ్(Bollywood), టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో వరుసబెట్టి ఆఫర్స్ కొట్టేస్తోంది. అలనాటి అందాల తార శ్రీదేవి(Sridevi) కూతురిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు చేసేస్తోంది. దేవర(Devara) మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) మూవీలో నటిస్తోంది. తాజాగా బాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ యాంకర్ కరణ్ జోహార్(Karan Johar) షోలో జాన్వీ సందడి చేసింది. ఈ సందర్భంగా పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది ఈ బాలీవుడ్ బ్యూటీ.
పిల్లలు, భర్తతో కలిసి తిరుమలలోనే..
శ్రీదేవి వారసురాలిగా సినీరంగ ప్రవేశం చేసిన జాన్వీ(Janhvi).. తనదైన నటనతో కొద్ది సమయంలోనే అగ్ర హీరోయిన్గా ఎదిగింది. ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తనకు తిరుపతి(Tirupati)లో పెళ్లి చేసుకోవాలని ఉందని తన కోరికను బయటపెట్టింది. అంతేకాదండోయ్.. ముగ్గురు పిల్లలను కనాలని ఉందని.. పిల్లలు, భర్తతో కలిసి తిరుమలలోనే హాయిగా గడపాలని ఉందని చెప్పింది. నిత్యం అరటి ఆకులో భోజనం చేస్తూ.. ‘‘గోవిందా గోవిందా(Govinda Govinda) అని సర్మించుకోవాలని ఉందని తెలిపింది.
మణిరత్నం మూవీల్లోని పాటలు వింటూ..
అంతేకాదు.. మణిరత్నం(Maniratnam) మూవీల్లోని పాటలు వింటూ కూర్చోవాలని ఉందని చెప్పుకొచ్చింది. తన భర్తను లుంగీలోనే చూడాలని ఉందని.. చూసేందుకు చాలా రొమాంటిక్‌గా ఉంటుందని జాన్వీ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా.. జాన్వీ కపూర్‌కు తిరుమల వేంకటేశ్వరస్వామి(Tirumala Venkateswara Swamy) అంటే ఎనలేని భక్తి. సమయం దొరికినప్పుడల్లా తిరుమలను సందర్శిస్తుంటారు. కాగా ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం RC16 మూవీలో నటిస్తోంది. బాలీవుడ్లో ‘సన్నీ సంస్కారీకి తులసీ కుమారి’ మూవీలో యాక్ట్ చేస్తోంది.
“I want to get married to my husband in Tirumala. Every day, I want to enjoy meals with my three kids on a banana leaf while listening to the chant of “Govinda Govinda.””
– #JanhviKapoor pic.twitter.com/9oOEaBvEZs
— KLAPBOARD (@klapboardpost) January 23, 2025








