Mana Enadu : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్. తాజాగా ప్రభాస్ స్వల్పంగా గాయపడ్డాడు. మూవీ షూటింగులో భాగంగా కాలు బెణికినట్లు తెలిసింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు విశ్రాంతి తీసుకోమని సూచించినట్లు సమాచారం. అయితే ప్రభాస్ కు గాయమైందని (Prabhas Leg Injury) తెలుసుకున్న అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన హీరో, తమ డార్లింగ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెబల్ స్టార్ గాయానికి సంబంధించిన న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.
ప్రభాస్ కాలికి గాయం
ప్రభాస్ గాయం గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. ఇది మారుతి దర్శకత్వంలో వస్తున్న ‘ది రాజా సాబ్’ (The Raja Saab) షూటింగ్ సెట్ లోనే జరిగి ఉండొచ్చని నెటిజన్లు అంటున్నారు. ఇప్పటికే ప్రభాస్ కాలు సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఇక మళ్లీ కాలుకే గాయం కావడం పట్ల ఈ హీరో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. తమ డార్లింగ్ హీరో త్వరగా కోలుకోవాలని దేవుళ్లకు ప్రార్థిస్తున్నారు. ‘ఆదిపురుష్’ సినిమా ఆడియో లాంచ్ సమయంలో కూడా ప్రభాస్ తన కాలు సమస్యతో బాధపడిన విషయం తెలిసిందే.
ప్రభాస్ చేతిలో ఐదు సినిమాలు
ఇక ప్రభాస్ సినిమాల సంగతికి వస్తే.. ప్రస్తుతం రెబల్ స్టార్ చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. వాటిలో మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది రాజా సాబ్ షూటింగు శరవేగంగా జరుగుతోంది. మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలోనూ ప్రభాస్ ఓ సినిమాకు పచ్చజెండా ఊపాడు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. ఇక ఇవే కాకుండా యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్ (Spirit)’ సినిమా చేస్తున్నాడు డార్లింగ్. త్వరలోనే ఆ చిత్రం కూడా పట్టాలెక్కనుంది.
ఆ రెండు సినిమాలకు సీక్వెల్స్
ఈ సినిమాలే కాకుండా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి (Prabhas Kalki Part 2) సినిమా పార్ట్-2, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ (Salar) కు పార్ట్-2 కూాడా ఉన్నాయి. ది రాజా సాబ్, హను రాఘవపూడి చిత్రం, స్పిరిట్ తర్వాత ఈ చిత్రాలు పట్టాలెక్కుతాయో లేదా ఓవైపు ఆ సినిమా షూటింగులు జరుగుతుండాగానే ప్రభాస్ ఈ సినిమాల సీక్వెల్ కు పని చేస్తాడో తెలియాలి. ప్రస్తుతం ప్రభాస్ కాలికి గాయం కావడం వల్ల ఆయన విశ్రాంతి తీసుకుంటే ఈ చిత్రాల షూటింగు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.








