RajyaSabha: విజయసాయి రాజీనామా.. ఎంపీ సీటు ఆ సీనియర్ నేతకేనా?

రాజ్యసభ సభ్యుడిగా ఉన్న YCP సీనియర్ నేత విజయసాయి రెడ్డి(Vijaya Sai Reddy) తన పదవికి శనివారం రాజీనామా(Resignation) చేశారు. ఆయన పదవీ కాలం 2028 జూన్ 21 వరకూ ఉంది.. అంటే MPగా మరో మూడున్నరేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగవచ్చు. కానీ ఆయన అందుకు విముఖత చూపారు. అయితే విజయసాయి రాజీనామాతో APలో మరో కొత్త చర్చకు తెరలేసింది. ఆయన ఖాళీ చేసిన స్థానం ఎవరికి దక్కుతుందనేది ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాజ్యసభ MPగా ఎంపికవ్వాలంటే అసెంబ్లీ MLAలు ఓటు వేయాల్సింది. ఇలా చూస్తే అధిక సంఖ్యాబలం ఉన్న కూటమికే ఆ స్థానం దక్కే అవకాశం ఉంది.

కూటమి పార్టీలలో ఎవరికనేదానిపై ఉత్కఠ

మరి TDP, జనసేన, BJP పార్టీలలో ఎవరికి సీటు దక్కుతుందనేది చర్చనీయాశంగా మారింది. అయితే ఇది కచ్చితంగా BJPకే వెళ్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. APలో బీజేపీకి కేవలం 8 మంది MLAల బలం ఉంది. కానీ జాతీయ స్థాయిలో అధికారంలో ఉండడంతో పాటు బీజేపీకి ఉన్న రాజకీయ పట్టు వల్ల ఆ పార్టీకి సీటు దక్కడం ఖాయమే అని భావిస్తున్నారు. ఒకవేళ బీజేపీకే ఇస్తే ఎవరికి అన్నది మరో చర్చ. అయితే బీజేపీ నుంచి ఇప్పటికే ఒక రాజ్యసభ సీటు R క్రిష్ణయ్యకు దక్కింది. ఆయన కూడా YCP ఎంపీగానే ఉంటూ రాజీనామా చేసి బీజేపీలో చేరి మళ్లీ రాజ్యసభ సభ్యుడు అయ్యారు.

ఏపీలో అధ్యక్ష బాధ్యతలు ఆయనకేనా?

అయితే సౌత్ ఇండియాలో ముఖ్యంగా ఏపీలో BJP బలపడాలని చూస్తోంది. దాంతో విపక్ష YCPకి బలంగా ఉన్న రాయలసీమలో గట్టిగా పునాది వేసుకునేందుకు అక్కడ నుంచే మాజీ సీఎం, బీజేపీ నేత అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి(Nallari Kiran Kumar Reddy)కి అవకాశం ఇస్తారని ప్రచారం సాగుతోంది. కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా రాయలసీమలో బీజేపీని మరింత పటిష్ఠం చేసుకోవాలని ఆ పార్టీ హైకమాండ్ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. మరో వైపు చూస్తే కిరణ్ కుమార్ రెడ్డికి ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యత(President of AP BJP)లు కూడా అప్పగిస్తారని సమాచారం. దీంతో ఎలాగైనా ఈసారి ఏపీలో కమలం పార్టీ వికాసానికి రాచబాట వేసుకోవడానికి బీజేపీ పావులు కదుపుతోందనేది కొందరి అభిప్రాయం.

Related Posts

Rains: వరుణుడు ఉప్పెనై.. వీధులు ఏరులై.. తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టిన వర్షం

తెలుగు రాష్ట్రాల్లో వానలు(Rains) దంచికొడుతున్నాయి. మరో ఐదు రోజులు రెండు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు(Heavy Rains) పడతాయని వాతావరణశాఖ(IMD) తెలిపింది. ఇదిలా ఉండగా నిన్న మధ్య తెలంగాణ(Telangana) జిల్లాలు వరుణుడి దెబ్బకు అతలాకుతలమయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రారంభమైన…

Assembly Seats: త్వరలో ఏపీ, తెలంగాణలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు!

రాష్ట్రాల అసెంబ్లీ స్థానల పునర్విభజనతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో అసెంబ్లీ స్థానాలు (Telangana Assembly Seats) పెరగవచ్చని తెలుస్తోంది. ఏపీలో 50 (AP Assembly Seats), తెలంగాణ(Telangana)లో 34 కొత్త అసెంబ్లీ స్థానాలు ఏర్పాటు కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *