‘కోల్డ్ ప్లే.. కోల్డ్ ప్లే.. కోల్డ్ ప్లే (Cold Play Band)’.. ఇప్పుడు ఇండియాలో ఎక్కడ చూసినా ఈ బ్రిటీష్ బ్యాండ్ పేరే వినిపిస్తోంది. భారత్ టూర్ లో ఉన్న ఈ బ్యాండ్ ఇండియాలో మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహిస్తోంది. అహ్మదాబాదా వేదికగా జరిగిన ఈ బ్యాండ్ మ్యూజిక్ కన్సర్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఈ కన్సర్ట్ లో సింగర్ క్రిస్ మార్టిన్ (Chris Martin) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే దీనిపై రౌడీ హీరో విజయ్ దేవరకొండ రియాక్ట్ అయ్యాడు.
ఇంతకీ క్రిస్ మార్టిన్ ఏమన్నాడంటే..?
అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యూజికల్ కన్సర్ట్ సూపర్ సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలో సింగర్ క్రిస్ మార్టిన్ మాట్లాడుతూ.. తన బ్యాండ్ మెంబర్స్ కు థాంక్స్ చెప్పారు. దాదాపు 29 ఏళ్ల నుంచి తాము సోదరులలాగా కలిసి మెలిసి ఉంటున్నామని చెప్పారు.
— @forumcoldplay (@fcpmidias) January 26, 2025
‘చాలా మందికి తెలియంది ఏంటంటే..? మేం నలుగురుం ఇండియాలోనే పుట్టాం. అందుకే మాది ఇండియన్ బ్యాండే. బేసిస్ట్ బెర్రిమాన్ చూడ్డానికి స్కాట్లాండ్ వాసిగా కనిపిస్తాడు కానీ.. అతనిది తమిళనాడు. ఇక నేను తెలంగాణ నుంచి వచ్చానని మీ అందరికీ తెలిసిందే. ఇక మా లీడర్ విల్ ఛాంపియన్ మమ్మల్ని ఒక్కటిగా కలిసుండేలా చూస్తున్నాడు.’ అని క్రిస్ (Chris Martin Video Viral) సరదాగా వ్యాఖ్యానించాడు.

ఆ సాంగ్స్ మ్యాషప్ అదిరిపోద్ది
ఇప్పుడు క్రిస్ కామెంట్స్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసి రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కూడా రియాక్ట్ అయ్యాడు. ‘‘వెల్‌కమ్ క్రిస్ మార్టిన్. పొడుస్తున్న పొద్దు మీద, కోల్డ్ ప్లే సాంగ్ పైన ఎవరైనా మ్యాషప్ చేస్తే బాగుంటుంది’’ అని విజయ్ ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. రౌడీ హీరో ఐడియా అదిరిందని ఇప్పుడు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. జనవరి 18 నుంచి 26 వరకూ ఇండియాలో పర్యటించిన కోల్డ్ ప్లే బ్యాండ్ ముంబయి, అహ్మదాబాద్‌లో కన్సర్ట్ నిర్వహించిన విషయం తెలిసిందే.






