కేంద్ర వార్షిక బడ్జెట్ వేళ దేశంలో బంగారం ధరలు (Gold Price Today) పెరిగాయి. ఇక వెండి రేటేమో తగ్గింది. శుక్రవారం రోజున రూ.84,800 ఉన్న 10 గ్రాముల బంగారం ధర.. శనివారం రోజున రూ.310 పెరిగి రూ.85,110కి పెరిగింది. ఇక కిలో వెండి ధర శుక్రవారం రూ.95,940 ఉండగా, శనివారం అది రూ. 300 తగ్గి రూ.95,640 వద్దకు చేరింది.
హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.85,110గా.. కిలో వెండి ధర రూ.95,640గా ఉంది. మరోవైపు విజయవాడలో పసిడి ధర రూ.85,110గా ఉండగా.. కిలో వెండి ధర (Silver Price Today) రూ.95,640 పలుకుతోంది. విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.85,110గా ఉండగా.. కిలో వెండి ధర రూ.95,640 వద్ద ఉంది. ప్రొద్దుటూరులో బంగారం ధర రూ.85,110గా ఉండగా.. కిలో వెండి ధర రూ.95,640గా పలుకుతోంది.







