ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఫిబ్రవరిలో వేతనాల పెంపును (Salary hike) ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది. దీనికి సంబంధించి త్వరలో ఉద్యోగులకు సమాచారం అందించనుందని నేషనల్ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. వేతనాల పెంపు సమాచారం మొదట జాబ్ లెవల్ 5 (JL5)లోని ఉద్యోగులకు అందనున్నట్లు సమాచారం. వీరికి ఫిబ్రవరిలో సంబంధిత లెటర్స్ జారీ చేయనున్నారట.
జనవరి 1 నుంచి అమలు
జనవరి 1వ తేదీ నుంచి వేతనాల పెంపు అమల్లోకి వస్తుందని కంపెనీ పేర్కొన్నట్లు తెలిసింది. జేఎల్5లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, సీనియర్ ఇంజినీర్లు, సిస్టమ్ ఇంజినీర్లు, కన్సల్టెంట్లు ఉంటారని సమాచారం. జాబ్ లెవల్ 6 ఆపై ఉన్నవారికి మార్చిలో లెటర్స్ అందుతాయని .. వీరికి ఏప్రిల్ నుంచి పెంపు వర్తిస్తుందని ఇంగ్లీష్ మీడియా వెల్లడించింది. జీతాల పెంపునకు సంబంధించి కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు.







