అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) హీరోగా, చందూ మొండేటి డైరెక్షన్‌లో తెరకెక్కిన మూవీ ‘తండేల్’(Tandel). ఈ చిత్రంలో చైతూకి జోడీగా సాయిపల్లవి(Sai Pallavi) సందడి చేయనుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్(Devisri Prasad) ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు. కాగా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పాటలు(Songs), టీజర్(Teaser) అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అందుకు తగ్గట్లే మూవీ యూనిట్ వరుస ప్రమోషన్స్(Promotions) నిర్వహిస్తోంది.
ప్రీరిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా అల్లు అర్జున్
తాజాగా ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్(Pre release event)ను హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఇవాళ నిర్వహించాలని భావించింది. అయితే ఈ వేడుక అనివార్య కారణాల వల్ల వాయిదా(Postpone) పడినట్లు తెలుస్తోంది. ఈనెల 4వ తేదీన నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon star Allu Arjun) ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో మేకర్స్ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ వేడుకకు అల్లు అర్జున్ రానుడంటంతో అభిమానుల(Fans)కు అనుమతి లేదని తెలిపింది. సినిమా బృందం తప్ప బయటి వారు ఎవరూ ఈ సినిమా వేడకకు రాకుండా జాగ్రత్తలు తీసుకోబోతున్నట్లు సమాచారం. పుష్ప 2(Pushpa2 Incident) సినిమా సమయంలో జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
వాయిదా పడింది..నాలుగున చేయడానికి ట్రయ్ చేస్తున్నారు https://t.co/BLAvKto0MG
— devipriya (@sairaaj44) February 1, 2025








