Chandu Mondeti: కార్తికేయ-3పై డైరెక్టర్ చందూ మొండేటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

చందూ మొండేటి (Chandu Mondeti).. కార్తికేయ(Karthikeya) మూవీతో డైరెక్టర్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. పదేళ్ల క్రితం రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్(Boxoffice) వద్ద సూపర్ హిట్ అందుకోవడంతో చందూకి ఆఫర్స్ క్యూ కట్టాయి. ఆ తర్వాత ఆయన డైరెక్ట్ చేసిన “ప్రేమమ్” మూవీ కూడా మంచి విజయాన్ని దక్కించుకుంది. అయితే ‘సవ్యసాచి’ మాత్రం అనుకున్న రేంజ్‌లో ఆడలేదు. దీంతో కాస్త స్పీడు తగ్గించిన ఈ యంగ్ డైరెక్టర్ కొంచెం బ్రేక్ ఇచ్చి మళ్లీ నిఖిల్‌తోనే ‘కార్తికేయ-2’ తెరకెక్కించి మళ్లీ ట్రాక్‌లో పడ్డాడు చందూ. తాజాగా నాగచైతన్య-సాయి పల్లవి(Naga Chaitanya-Sai Pallavi) జోడీగా ‘తండేల్(Thandel)’ మూవీకి డైరెక్షన్ వహించాడు. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో చందూ కార్తికేయ-3(Karthikeya-3)పై ఓ అప్డేడ్ రివిల్ చేశాడు.

పెరిగిన బాధ్యతను మర్చిపోలేదు

బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని దక్కించుకుంది కార్తికేయ-2. ఈ నేపథ్యంలో డైరెక్ట్ చందూ ‘కార్తికేయ-3’ గురించి ఓ ఇంటర్వ్యూ(Interview)లో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ చిత్రం చాలా కొత్త అనుభవాన్ని ఇవ్వనుందని. ‘‘కార్తికేయ-3 కోసం ఒక అద్భుతమైన కథ రెడీ చేసుకున్నానని. ‘కార్తికేయ-2’ సక్సెస్ తరువాత పెరిగిన బాధ్యతను తాను మర్చిపోలేదని అన్నారు. ‘కార్తికేయ-2’ ద్వారా కృష్ణ భగవానుడి(Lord Krishna) ఆశీర్వాదం కొత్త జీవితాన్ని, కెరీర్‌ను ప్రసాదించింది. అందుకు నేను భక్తి పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ‘కార్తికేయ-3’ కూడా కృష్ణ భగవానుడి కథను ఆధారంగా తీసుకొని సాగుతుంది’’ అని చెప్పాడు చందూ.

పురాణాల ఆధారంగా మరిన్ని కథలు

చందూ మొండేటి మాట్లాడుతూ, ‘‘నేను ఎప్పటి నుంచో కృష్ణుడి గురించి ప్రేక్షకులకు తెలియజేయాలని అనుకుంటున్నాను. ‘కార్తికేయ-2’ ద్వారా అనేక మంది పిల్లలు కూడా కృష్ణుడి గురించి తెలుసుకోవడం నాకు ఎంతో సంతోషం కలిగించింది. ఇకపై నా సినిమాల ద్వారా మన సంస్కృతి, మూలాలు, పురాణాల ఆధారంగా మరిన్ని కథలను చెప్పాలని అనుకుంటున్నట్లు’’ వెల్లడించారు.

Related Posts

మళ్లీ భారత్‌లోకి టిక్‌టాక్? క్లారిటీ ఇచ్చిన కేంద్రం ప్రభుత్వం..

2020 గాల్వన్ లోయ ఘటన తర్వాత భారత్–చైనా మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ సమయంలోనే భారత ప్రభుత్వం డేటా భద్రత, గోప్యతా సమస్యలను ప్రస్తావిస్తూ పలు చైనా యాప్‌లపై నిషేధం విధించింది. టిక్‌టాక్(TikTok), అలీ ఎక్స్‌ప్రెస్(ali Express), షీన్(Sheein) వంటి…

BIGG BOSS-S9: బుల్లితెర ప్రేక్షకులకు అదిరిపోయే న్యూస్.. వచ్చే నెల 7 బిగ్‌బాస్-9 షురూ

తెలుగు టెలివిజన్ రియాలిటీ షోలలో అత్యంత ప్రజాదరణ పొందిన ‘బిగ్ బాస్(Bigg Boss) తెలుగు’ సీజన్ 9(BB-9) సెప్టెంబర్ 7 నుంచి ఆరంభం కానుంది. స్టార్ మా(Star Maa), జియో హాట్‌స్టార్‌(Jio Hotstar)లో ప్రసారం కానున్న ఈ షోను అక్కినేని నాగార్జున(Nagarjuna…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *