రతన్‌ టాటా వీలునామాలో రహస్య వ్యక్తికి రూ.500 కోట్లు!

దివంగత పారిశ్రామికవేత్త రతన్‌ టాటా (Ratan Tata) లక్షల కోట్ల సామ్రాజ్యానికి అధిపతిగానే కాదు.. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా పేరు సంపాదించుకున్నారు. ఆయన ఒక మహోన్నత సామాజిక సేవకుడు. తనుకున్న వేల కోట్ల ఆస్తిని తన వద్ద పనిచేస్తున్న వారికి, పెంపుడు శునకాలకు ఇస్తూ వీలునామా రాసిన విషయం తెలిసిందే.

ఆ వ్యక్తికి రూ.500 కోట్లు

అయితే తాజాగా రతన్ టాటా వీలునామా (Ratan Tata Will) అంటూ మరో వీలునామా బయటకు వచ్చింది. అయితే అందులో ఓ రహస్య వ్యక్తికి తన ఆస్తిలో ఏకంగా రూ.500 కోట్లు ఇవ్వాలని రతన్‌ టాటా పేర్కొన్నట్లు ఉండటం చూసి ఆయన సన్నిహితులు షాక్ అవుతున్నారు. జంషెడ్‌పుర్‌కు చెందిన ట్రావెల్స్‌ వ్యాపారవేత్త మోహిని మోహన్ దత్తా(Mohini Mohan Dutta) ఆ రహస్య వ్యక్తి అని పలు మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. మోహన్ దత్తా ఆరు దశాబ్దాలకు పైగా రతన్‌టాటా దగ్గర నమ్మకంగా పని చేసిన విషయం తెలిసిందే.

చాలా ఏళ్ల నుంచి పరిచయం

తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్‌లో భాగమైన తాజ్ సర్వీసెస్‌తో 2013 నుంచి మోహన్‌ దత్తాకు చెందిన ‘‘స్టాలియన్ ట్రావెల్ ఏజెన్సీ’’ కలిసి పని చేస్తోంది.  మోహిని .. టాటా కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉండేవారని.. టాటా గ్రూప్‌నకు చెందిన అధికారులు తెలిపారు. డిసెంబర్ 2024లో ముంబయిలోని NCPA (ఎన్సీపీఏ)లో నిర్వహించిన రతన్ టాటా జన్మదిన వేడుకలకు దత్తాను ఆహ్వానించినట్లు సమాచారం.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *