బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) రీసెంట్గా హీరోయున్‌గా నటించిన కొత్త బాలీవుడ్ చిత్రం దేవ (Deva). షాహిద్ కపూర్ (Shahid Kapoor) హీరోగా నటించగా మలయాళ చిత్రం ముంబై పోలీస్‌కు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. గత నెల చివరలో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్(Box Office) వద్ద అనుకున్న మేర ఆకట్టులేకపోయింది. కానీ ఈ మూవీలో షాహిద్, పూజాల మధ్య చిత్రీకరించిన ఓ రొమాంటిక్ సాంగ్(Romantic song)కు మాత్రం సూపర్ క్రేజ్ దక్కించుకుంది. ఇటీవల ఈ వీడియో సాంగ్(Video Song)ను రిలీజ్ చేయగా యూట్యూబ్‌లో సూపర్ రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది.

మరో రెండు సినిమాల్లో ఆఫర్ కొట్టేసిన పూజా హెగ్డే
కాగా ప్రస్తుతం తమిళంలో విజయ్(Vijay), సూర్య(Suriya) వంటి స్టార్ హీరోల చిత్రాలు, బాలీవుడ్లో రెండు సినిమాల్లో పూజా నటిస్తోంది. గత కొంతకాలంగా ఎలాంటి హంగామా లేకుంగా, సోషల్ మీడియా(SM)లోనూ అంతగా కనపించని ఈ ముద్దగుమ్మ దేవ (Deva) సినిమా విడుదల అనంతరం ఒక్కసారిగా దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఇందుకు కారణం ఏంటంటే.. ఎప్పుడూ ట్రెండీ డ్రెస్సుల్లోనే కనిపించే ఈ అమ్మాడి.. ఈ మూవీలో ఘాటైన ముద్దు సన్నివేశంలో నటించడమే. అయితే దేవ సినిమాలో మాత్రం అందుకు డిఫరెంటుగా లిప్ లాక్(Lip lock)లతో అదరగొట్టింది. ఆ వీడియో సాంగ్ మీరూ చూసేయండి..








