రామ్ చరణ్(Ram Chanran).. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఇచ్చిన చెర్రీ.. 2007లో “చిరుత(Chiruta)” సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు. అతడు నటించిన రెండో సినిమా ‘మగధీర(Magadheera)’తోనే ఇండస్ట్రీ రికార్డులు కొల్లగొట్టాడు. ఒకవిధంగా చెప్పాలంటే ఈ సినిమా ఆధారంగానే బాహుబలి, బాహుబలి-2, కల్కి వంటి చిత్రాలపై డైరెక్టర్లు ఫోకస్ చేశారని చెప్పవచ్చు. మగధీర తర్వాత కాస్త డిఫరెంట్‌గా ట్రై చేశాడు చెర్రీ.. ఆ క్రమంలో జెనీలియాతో కలిసి ‘ఆరెంజ్(Orange)’ అంటూ లవ్ స్టోరీ చేశాడు. ఈ మూవీ మ్యూజికల్ హిట్‌గా నిలిచినప్పటికీ మూవీ మాత్రం అనుకున్న మేర సక్సెస్ సాధించలేకపోయింది.
కమ్‌బ్యాక్ ఇచ్చే పనిలో చెర్రీ
ఇక ఆ తర్వాత ‘రంగస్థలం’ మూవీతో రీజినల్ ఇండస్ట్రీ హిట్ సాధించిన రామ్ చరణ్, RRR మూవీతో పాన్ ఇండియా రేంజ్‌లో పేరు తెచ్చుకున్నాడు. దీంతోనే ‘గ్లోబల్ స్టార్(Global Star)’ ట్యాగ్ సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ జపాన్‌లో ఈ సినిమా థియేటర్స్‌లో ఆడుతూనే ఉంది. అటు అమెరికన్ సిటిజెన్స్‌లో కూడా చెర్రీకి మామూలు క్రేజ్ లేదు. ‘గేమ్ ఛేంజర్(Game Changer)’ రిజల్ట్ కాస్త తేడా కొట్టినా బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో కమ్‌బ్యాక్ ఇవ్వాలని ఆశిస్తున్నాడు రామ్ చరణ్. అయితే చెర్రీ కెరీర్‌లో చాలా సూపర్ హిట్ సినిమాలను రిజెక్ట్ చేశాడనే విషయం చాలా మందికి తెలియదు.

చెర్రీ వదులుకున్న సినిమాలు ఇవే..
ఈ జాబితాలో దుల్కర్ సల్మాన్ హీరోగా, నిత్యామేనన్(Nithyamenon) హీరోయిన్‌గా నటించిన సూపర్ హిట్ మూవీ ‘ఒకే బంగారం’. అలాగే గౌతమ్ వాసుదేవ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన మూవీ ‘ఏటో వెళ్లిపోయింది మనసు’. అఖిల్ హీరోగా తెరకెక్కిన ఏజెంట్. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన డార్లింగ్(Darling). అయితే అప్పటికే ‘ఆరెంజ్’ మూవీ సైన్ చేయడంతో ‘డార్లింగ్’ మూవీని రిజెక్ట్ చేశాడట చెర్రీ. అలాగే సూర్య హీరోగా తెరకెక్కించిన కల్ట్ క్లాసిక్ మూవీ సూర్య S/o కృష్ణన్. ఈ సినిమాకి ముందుగా గౌతమ్ మేనన్ చరణ్‌ని ఫిక్స్ చేసుకున్నాడు. కానీ వరుస ఫ్లాపుల్లో. ఉన్న అతనితో సినిమా చేసేందుకు రామ్ చరణ్ ఆసక్తి చూపించలేదని టాలీవుడ్(Tollywood)లో టాక్. ఇలా చాలా సినిమాలను కాదునుకున్న చరణ్ ప్రస్తుతం RC16తో బిజీగా ఉన్నాడు.








