‘‘దబిడి దిబిడి’ కాంట్రవర్సీ అస్సలు ఊహించలేదు’

నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్‌’ (Daaku Maharaaj). ఈ చిత్రంలో బాలయ్య, బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలాకు మధ్య ‘దబిడి దిబిడి (Dabidi Dibidi)’ అనే ఓ స్పెషల్ సాంగ్ వస్తుంది. ఈ పాట కొరియోగ్రఫీపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. బాలయ్య స్టెప్పులు చాలా వల్గర్ గా ఉన్నాయంటూ నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తాజాగా ఈ సాంగ్ కొరియోగ్రఫీపై వచ్చిన కాంట్రవర్సీ గురించి ఊర్వశీ రౌటేలా (Urvashi Rautela) స్పందించింది.

ఆ ట్రోలింగ్ ఊహించలేదు

“డాకు మహారాజ్ సినిమాలో దబిడి దిబిడి సాంగ్ (Dabidi Dibidi Song Controversy) రిహార్సల్స్‌ చాలా కూల్ గా జరిగాయి. ఈ పాటకు శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేశారు. నేను ఆయనతో నాలుగు సార్లు వర్క్ చేశాను. ఆయన దబిడి దిబిడి పాటకు స్టెప్పులు కంపోజ్ చేసినప్పుడు నాకు వల్గర్ గా ఏం అనిపించలేదు. రిహార్సల్స్ చేస్తున్నప్పుడు కూడా అభ్యంతరకరంగా అనిపించలేదు. కానీ సాంగ్ రిలీజ్ తర్వాత నెట్టింట వచ్చిన విమర్శలు, ట్రోల్స్ చూసి షాక్ అయ్యాను. రిహార్సల్స్‌ క్లిప్స్‌ రిలీజ్ చేసినప్పుడు ఇలాంటి విమర్శలు రాలేదు. సోషల్‌మీడియా వేదికగా కొంతమంది కావాలని చేసే వ్యాఖ్యలను నేను పట్టించుకోను.” అని ఊర్వశీ చెప్పుకొచ్చారు.

డాకు మహారాజ్ @ రూ.100 కోట్లు

ఇక డాకు మహారాజ్ సినిమా సంగతికి వస్తే నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా బాబీ (Bobby Kolli) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ‘డాకు మహారాజ్‌’. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రజ్ఞా జైస్వాల్‌, శ్రద్ధా శ్రీనాథ్‌, బాబీ దేవోల్‌ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. తమన్‌ మ్యూజిక్ అందించిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగవంశీ నిర్మించారు. ఈ సినిమా సుమారు రూ.100 కోట్లకు పైగా వసూలు (Daaku Maharaaj Collections) చేసినట్లు అంచనా.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *