
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సెకండ్ ఇన్నింగ్స్ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం చిరు.. ‘బింబిసార (Bimbisara)’ ఫేమ్ విశిష్టతో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘విశ్వంభర (Vishwambhara)’ పేరుతో రానున్న ఈ సోషియో ఫాంటసీ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్ ఇప్పటికే ప్రేక్షకులకు ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ మూవీ గురించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటంటే?
600 మందితో చిరు స్టెప్పులు
ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ షెడ్యూల్ లో చిరంజీవితో ఓ సాంగ్ (Vishwambhara Song) ను షూట్ చేయనున్నారట. ఇందుకోసం ఓ భారీ సెట్ ను డిజైన్ చేస్తున్నారట. 600 మంది డ్యాన్సర్లతో చిరు ఈ పాటకు స్టెప్పులు వెయ్యనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. శోభా మాస్టర్ ఈ సాంగ్ కు కొరియోగ్రఫీ చేస్తున్నాట్లు తెలిసింది.
వింటేజ్ చిరు విల్ బీ బ్యాక్
ఇక ఈ పాటలో చిరంజీవి డ్యాన్స్ సినిమాకే హైలైట్ గా నిలవనుందట. మెగాస్టార్ అంటేనే డ్యాన్సుకు పెట్టింది పేరు. ఆయన గ్రేస్ చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. అలాంటిది ఏకంగా 600 మంది డ్యాన్సర్లతో కలిసి చిరు స్టెప్పేస్తే.. ఆ ఊహే ఒక రేంజులో ఉంది. ఈ పాటలో వింటేజ్ చిరు డ్యాన్స్ చూస్తామంటూ నెట్టింట ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఇక ఈ సాంగ్ షూట్ తర్వాతే సినిమా మిగతా షెడ్యూల్‌ను కంప్లీట్ చేయనున్నారట.
సోషియో ఫాంటసీగా విశ్వంభర
‘విశ్వంభర’ సినిమా విషయానికొస్తే – చిరంజీవి సరసన ఇందులో ఇద్దరు హీరోయిన్లు త్రిష (Trisha), అషికా రంగనాథ్ నటించనున్నారట. సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్, బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ కలిసి నిర్మిస్తున్నారు. ‘జగదేక వీరుడు అతిలోకసుందరి’, ‘అంజి’ తర్వాత చిరు నుంచి సోషియో ఫాంటసీ జానర్లో వస్తున్న సినిమా ‘విశ్వంభర’.