
‘మా ఇంట్లో అందరూ అమ్మాయిలే. చరణ్ ను కొడుకుని కనమని చెబుతున్నాను. మెగా ఫ్యామిలీకి ఓ వారసుడు కావాలి’ అంటూ బ్రహ్మా ఆనందం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. ఇప్పటికే చిరు కామెంట్స్ పై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. 2025 కాలంలో కూడా ఇంకా వారసుడిగా అబ్బాయే కావాలని అనడం ఏంటంటూ ఫైర్ అవుతున్నారు. తాజాగా దీనిపై యాంకర్, నటి శ్యామల (Shyamala) స్పందించారు. ఈ సందర్భంగా ఆమె చిరంజీవి కామెంట్స్ పై తీవ్రంగా విమర్శలు కురిపించారు.
వారసుడు కొడుకేనా.. కూతురు కాదా?
“కొడుకే వారసుడు అవుతాడా.? కూతుళ్లు అవ్వలేరా.. నాకు ఈ కామెంట్స్ అర్థం కాలేదు. చిరంజీ గారు ఏం ఉద్దేశంతో అలా మాట్లాడి ఉంటారో ఆయనకే తెలియాలి. వారసుడు కొడుకు మాత్రమే అవ్వాలి అనే ఆలోచన నుంచి చిరంజీవితో పాటు చాలామంది బయటకు వస్తే బాగుంటుంది. ఈ జనరేషన్‌లో ఇలాంటి వ్యాఖ్యలు సరికావు. చిరంజీవి ఇంట్లోనే వ్యాపారంలో చక్కగా రాణిస్తున్న ఆయన కోడలు ఉపాసన ఉన్నారు. వారసుడు కొడుకు మాత్రమే కాదు కూతురు కూడా అవ్వొచ్చని ఆమె నిరూపిస్తున్నారు. ఈ విషయంలో ఇంతకంటే ఎక్కువగా మాట్లాడలేను.” అంటూ శ్యామల చెప్పుకొచ్చింది.
పేరుకే పెద్ద మనిషి !!
21 వ శతాబ్దంలో కూడా కొడుకులే వారసులు అని అమ్మాయిలని కించపరిచేలా #Chiranjeevi వ్యాఖ్యలు చెయ్యడం పైన
సభ్యసమాజం ముఖ్యంగా మహిళాలోకం నుంచి తీవ్ర నిరసన సెగ !! pic.twitter.com/U6kuyLI1uh
— YS Jagan Army ®️ (@YSJaganAarmy) February 12, 2025
అసలేం జరిగిందంటే..?
బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రహ్మా ఆనందం (Brahma Anandam)’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఓ మనవడు కావాలని చిరంజీవి అన్నారు. కానీ చరణ్‌కి మళ్లీ ఆడపిల్ల పుడుతుందేమో అని తనకు భయంగా ఉందంటూ చిరంజీవి (Chiranjeevi Sexist Comments) చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. 2025లో కూడా వారసుడు కావాలని కోరుకుంటున్న మనుషులు ఉన్న సమాజంలో మనం బతుకుతున్నాం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.