
టాలీవుడ్ రౌడీ హీరో ది విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సినిమా VD 12 నుంచి అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మేకర్స్ VD 12 టీజర్ (VD12 Teaser) ను రిలీజ్ చేశారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఒరిజినల్ టైటిల్‌నూ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ‘కింగ్‌డమ్ (KINGDOM)’ పేరుతో వస్తున్న ఈ సినిమా టీజర్ ను మేకర్స్ ఇవాళ విడుదల చేశారు.
ఎన్టీఆర్ వాయిస్ తో గూస్ బంప్స్
ఈ టీజర్ కు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) వాయిస్ ఓవర్ అందించారు. “అలసట లేని భీకర యుద్ధం…. అలలుగా పారే ఏరుల రక్తం…. వలసపోయినా అలిసిపోయినా ఆగిపోదీ.. మహారణం…. నేలపైన దండయాత్రలో మట్టికింద మృతదేహాలు…. ఈ అలజడి ఎవరికోసం..? ఇంత బీభత్సం ఎవరికోసం..? అసలీ వినాశనం ఎవరికోసం..? రణభూమిని చీల్చుకుని పుట్టే కొత్త రాజు కోసం…. కాలచక్రాన్ని బద్ధలుకొట్టి పునర్జన్మనెత్తిన నాయకుడి కోసం...” అంటూ ఎన్టీఆర్ చెప్పిన వాయిస్ ఓవర్ ఈ టీజర్ కే హైలైట్ గా నిలిచింది.
మొత్తం తగలబెట్టేస్తా
ఇక చివరలో విజయ్ దేవరకొండ ‘ఏమైనా చేస్తా సార్.. అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సార్’ అంటూ తనదైన శైలిలో డైలాగ్ చెప్పడంతో టీజర్ ముగుస్తుంది. ఈ మూవీ తమిళ్ టీజర్‌కు సూర్య, హిందీ టీజర్‌కు రణ్‌బీర్ కపూర్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే (VD 12 Teaser). ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్, ఫార్జున్ 4 సినిమాస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.