
అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి(Sai Pallavi) జోడీగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘తండేల్(Thandel)’. చందు మొండేటి(Chandu Mondeti) దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాస్(Bunny Vasu) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో హీరోతో పాటు సమానమైన పాత్రలో సాయి పల్లవి కనిపించింది. మూవీ రిలీజ్ తర్వాత నాగచైతన్యతో పాటు ఆమె నటనకు కూడా మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే ఈ చిత్రానికి టాక్ బాగున్నా ఆశించిన స్థాయిలో వసూళ్లు(Collections) రావడం లేదని ట్రేడ్ వర్గాల టాక్.
బిజీగా ఉండటం వల్లే రాలేకపోతున్నారా?
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సినిమా విడుదల తరువాత కూడా ప్రమోషన్స్(Promotions)ను కొనసాగిస్తోంది. అయితే సినిమా విడుదల తరువాత ఇప్పటి వరకు జరిగిన ఏ ప్రమోషన్‌లో కూడా సాయి పల్లవి కనిపించలేదు. పైగా సక్సెస్ సెలబ్రేషన్స్(Success Celebrations), ప్రెస్‌మీట్స్, ఇంటర్వ్యూల్లో ఎక్కడా కూడా హీరోయిన్ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే సాయి పల్లవి బిజీగా ఉండటం వల్లే రాలేకపోతున్నారని చిత్ర యూనిట్ చెబుతోంది.
ఆ సీన్లు తొలగించడంపై అభ్యంతరం
కానీ దీనికి మరో కారణం కూడా ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సినిమాలో సాయి పల్లవి నటించిన కొన్ని కీలక సన్నివేశాలు(Key scenes) డైరెక్టర్ తొలగించడమే కారణమని సమాచారం. తన సీన్స్‌ను తొలగించడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని, దీంతో సినిమా రిలీజ్ తరువాత ఆమె పబ్లిసిటీ(publicity)కి దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. అయితే దర్శకుడు చందు మొండేటి మాత్రం సాయి పల్లవిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారట.