
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం ఐదు సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. ది రాజా సాబ్, సలార్-2, కల్కి-2, హనురాఘవపూడితో ఓ చిత్రంతో పాటు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రానున్న స్పిరిట్ కూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ సందీప్ ఆ సినిమా పనులు షురూ చేశాడు. ఇందులో భాగంగానే ఈ సినిమాలో నటించే నటీనటుల కోసం హంట్ మొదలుపెట్టాడు. సినిమాల్లో నటించేందుకు ఉత్సాహంగా ఉన్న ఆశావాహులను ఎంపిక చేసుకునేందుకు ‘స్పిరిట్ టీమ్ కాస్టింగ్ కాల్ (Spirit Casting Call)’ ఇచ్చింది.
స్పిరిట్ కాస్టింగ్ కాల్
‘స్పిరిట్ (Prabhas Spirit)) సినిమా కోసం ఆ చిత్రబృందం ఆడిషన్స్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు భద్రకాళి పిక్చర్స్ సంస్థ సోషల్ మీడియాలో ‘స్పిరిట్ కాస్టింగ్ కాల్’ అంటూ ఓ పోస్టర్ షేర్ చేసింది. వయసుతో సంబంధం లేకుండా ఆసక్తి గల నటీనటులందరికీ ఈ అవకాశం ఉంటుందని తెలిపింది. ఫిలిం లేదా థియేటర్ బ్యాగ్రౌండ్ ఉన్న నటులను మాత్రమే తీసుకోబోతున్నట్లు చెప్పింది. 2 ఫొటోలు, 2 నిమిషాల నిడివితో ఉన్న వీడియో రికార్డ్ చేసి సంబంధింత మెయిల్‌కు పంపాలని సూచించింది. వీడియోలో పేరు, ఎడ్యుకేషన్, అనుభవం వంటి వివరాలు తెలియజేయాలని పేర్కొంది.
We’re calling all aspiring actors for an exciting casting opportunity in our film, “Spirit”. pic.twitter.com/DgLZ5kIvNO
— Bhadrakali Pictures (@VangaPictures) February 12, 2025
స్పిరిట్ తో ప్రభాస్ ర్యాంపేజ్
ఇక ఈ సినిమా సంగతికి వస్తే ఈ చిత్రంలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. సినిమాలో యాక్షన్ డోస్ హై రేంజ్లో ఉంటుందని ఇప్పటికే డైరెక్టర్ సందీప్ (Sandeep Reddy Vanga) చెప్పిన విషయం తెలిసిందే. వేసవి తర్వాత ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. 6 నెలల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. యానిమల్ (Animal) తర్వాత సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.