
టాలీవుడ్ యంగ్ టాలెంట్ కిరణ్ అబ్బవరం (kiran abbavaram) మరో కొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విశ్వకరుణ్ దర్శకత్వంలో ‘దిల్ రూబా (dilruba)’ అనే చిత్రంలో కిరణ్ నటిస్తున్నాడు. ఈ మూవీ తన కెరీర్ లో పదో సినిమా. ఈ చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్ ప్రొడక్షన్, ఏయూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రుక్సర్ థిల్లాన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.
#Dilruba ♥️ pic.twitter.com/JiUkWPrdvd
— Rukshar Dhillon (@RuksharDhillon) February 12, 2025
దిల్ రూబా రిలీజ్ డేట్ ఫిక్స్!
అయితే ‘క (Ka Movie)’ సినిమాతో గతేడాది బ్లాక్ బస్టర్ కొట్టిన కిరణ్ అబ్బవరం దిల్ రూబాతో ప్రేక్షకుల దిల్ కొల్లగొట్టేందుకు ఈ వాలెంటైన్స్ డే (Valentines Day 2025) ఫిబ్రవరి 14వ తేదీన థియేటర్లలోకి వద్దామనుకున్నాడు. కానీ చివరి నిమిషంలో మేకర్స్ రిలీజ్ ను వాయిదా వేశారు. రిలీజ్ డేట్ ను త్వరలోనే అనౌన్స్ చేయనున్నట్లు చెప్పారు. అయితే మార్చి 14వ తేదీన తిరిగి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
వాయిదాల మీద వాయిదాలు
ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ‘దిల్ రూబా’ టీజర్ (Dilruba Teaser) ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. మరోవైపు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ అగ్గిపుల్లె కూడా ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. అయితే క సినిమా కంటే ముందుగా దిల్ రూబా చిత్రం రావాల్సి ఉన్నా.. అనుకోని కారణాల వల్ల ఇది వాయిదా పడింది. ఇక ఫిబ్రవరి 14 రిలీజ్ చేద్దామనేలోగా మరోసారి వాయిదా పడింది. ఇక రెండు వాయిదాల అనంతరం మార్చిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోందట.