iPhone SE4: టెక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఈనెల 19న మార్కెట్లోకి ఐఫోన్ ఎస్ఈ4

మొబైల్ లవర్స్‌కు వాలంటైన్స్ డే సందర్భంగా ఆపిల్ సంస్థ(Apple Company) శుభవార్త చెప్పింది. టెక్ ప్రియులు ఎన్నోరోజులుగా ఎదురు చూస్తోన్న ఐఫోన్ ఎస్ఈ4((iPhone SE4))ను ఈనెల 19న మార్కెట్లలోకి విడుదల చేయనున్నట్లు ఆపిల్ సంస్థ సీఈవో టిమ్ కుక్(Apple CEO Tim Cook) ట్విటర్ (X)వేదికగా తెలిపారు. ఈ మేరకు సిల్వర్ కలర్‌(Silver)లో మెరిసే యాపిల్ లోగో(Apple Logo)ను ఆయన షేర్ చేశారు. అయితే ప్రొడక్ట్‌కు సంబంధించి ఆయన ఇతర వివరాలేవీ వెల్లడించలేదు. ఆపిల్ ఐఫోన్‌ ఎస్‌ఈ(iPhone SE) సిరీస్‌కు స్పెషల్‌గా అభిమనులు ఉన్నారు. కాగా 2022లో చివరిసారిగా SE Modelను లాంచ్‌ చేయగా, దాదాపు మూడేళ్ల తర్వాత మళ్లీ కొత్త వర్షన్‌‌ను మార్కెట్లోకి తీసుకొస్తోంది ఆపిల్.

ఈ ఫీచర్స్ ఉండే అవకాశం

కాగా, ఐఫోన్ ఎస్ఈ 4 ధర కూడా తక్కువగా ఉండొచ్చని తెలుస్తోంది. బేస్ వేరియంట్‌ను సుమారు ₹43,900ధరలో అందించే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంటున్నారు. అలాగే ఇందులో ఐఫోన్‌ 14 తరహాలో హోమ్‌ బటన్‌,టచ్‌ ఐడీ లేకుండా ఫేస్‌ ఐడీ ఫీచర్‌తో లాంచ్ అయ్యే ఛాన్సుందట. ఆపిల్ ఇంటెలిజెన్స్‌ ఇంటిగ్రేషన్, USB-C పోర్ట్, A18 చిప్‌సెట్‌తో మరింత శక్తివంతమైన పనితీరు అందించేలా ఫీచర్స్ సెట్ చేసినట్లు సమాచారం. ఆ సంస్థ తాజా ప్రకటనతో టెక్ లవర్స్ తెగ సంబరపడిపోతున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *