
అందరూ ఉత్కంఠగా ఎదురుచూసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi Assembly Elections) ఫలితాలు ఈ నెల 8న వెలువడిన విషయం తెలిసిందే. మొత్తం 70 స్థానాల్లో జరిగిన ఎన్నికల్లో BJP రికార్డు స్థాయిలో 48 సీట్లు నెగ్గి ఘనవిజయం సాధించింది. అంత వరకూ బాగానే ఉంది. కానీ కమలం పార్టీకి అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. ఢిల్లీ సీఎంగా ఎవరిని(Who is Delhi Cm) ఎంపిక చేయాలన్న దానిపై బీజేపీ అధిష్ఠానం మళ్లగుల్లాలు పడుతోంది. అయితే సీఎం అభ్యర్థి ఎంపికై ప్రధాని మోదీ(PM Modi) లేకపోవడంతో ఆలస్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది.
మోదీ రాగానే బీజేపీ శాసనసభా పక్ష సమావేశం
మోదీ ఫ్రాన్స్(France), అమెరికా(USA) పర్యటన ముగించుకొని భారత్ రాగానే CM అభ్యర్థి ఎంపిక ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు సీఎం అభ్యర్థి ప్రమాణ స్వీకారం ఈనెల 19 లేదా 20 తేదీల్లో ఉంటుందని కమలం పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో ఫిబ్రవరి 18, 19 తేదీల్లో బీజేపీ శాసనసభా పక్ష(BJP Legislative Party Meeting) నేతలు సమావేశం కానున్నారని తెలుస్తోంది. ఈ భేటీకి ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah), పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కీలక నేతలు హాజరు కానున్నారు. ఈ సమావేశం అనంతరం సీఎం ఎవరనేదానిపై స్పష్టత రానుంది.
15 మందితో జాబితా సిద్ధం?
ఎన్నికల్లో గెలిచిన 48 మంది MLAల్లో 15 మందితో అధిష్ఠానం ఓ జాబితా రూపొందించిందని సమాచారం. ఇందులో తొమ్మిది మందిని CM, స్పీకర్, క్యాబినెట్ స్థానాలకు ఎంపిక చేయనుంది. ఢిల్లీ CM రేసులో అరవింద్ కేజ్రీవాల్(Kejriwal)ను ఓడించిన పర్వేశ్ వర్మ(
Parvesh Verma), సతీశ్ ఉపాధ్యాయ్, విజయేందర్ గుప్తా, ఆశిష్ సూద్, పవన్ శర్మ వంటి పలువురు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. పూర్వాంచల్ నేపథ్యం కలిగిన ఎమ్మెల్యే, సిక్కు లేదా మహిళను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉండవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. మొత్తం మీద ఢిల్లీ పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.