
మరో 5 రోజుల్లో మినీ వరల్డ్ కప్‌గా భావించే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్(Pakistan), UAE వేదికగా ఈ మినీ సంగ్రామం మొదలు కానుంది. మార్చి 9న ఫైనల్ జరుగుతుంది. కాగా ఇప్పటికే మార్పులు చేర్పుల అనంతరం భారత్(Team Indai) సహా అన్ని జట్లు తమ తుది జట్ల(Final Teams)ను ప్రకటించాయి. తాజాగా ఈ గ్రాండ్ ఈవెంట్‌కు సంబంధించి ఐసీసీ ప్రైజ్ మనీ(Prize money) విడుదల చేసింది. మొత్తం రూ.60 కోట్లను ఈసారి టోర్నీకి కేటాయించింది. మరి ఈ మొత్తంలో ఏ జట్టు ఎంత మొత్తం దక్కించుకుంటుందో ఓ సారి చూద్దామా..
☛ మొత్తం ప్రైజ్ మనీ రూ.60 కోట్లు
☛ విజేతకు – రూ. 20.8కోట్లు
☛ రన్నరప్‌కు – రూ. 10.4 కోట్లు.
☛ సెమీ ఫైనలిస్టులకు – రూ. 5.2 కోట్లు.
☛ 5,6వ స్థానాల్లోని జట్లకు – రూ.3 కోట్లు
☛ 7,8వ స్థానాల్లోని జట్లకు – రూ.1.2 కోట్లు.
☛ ప్రతి మ్యాచ్‌కి – రూ. 29 లక్షలు
మొత్తం 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు గ్రూప్-Aలో ఇండియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఉండగా.. గ్రూప్-Bలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, అఫ్గానిస్థాన్ జట్లు ఉన్నాయి. ప్రతి జట్టు గ్రూపులోని ఇతర జట్లతో ఒక్కోమ్యాచ్ ఆడుతుంది. టాప్-2లో నిలిచిన జట్లు సెమీస్(Semis)కు చేరుతాయి. సెమీస్‌లో నెగ్గిన జట్లు మార్చి 9న ఫైనల్(Final)లో తలపడుతాయి.
🚨 THE PRIZE MONEY IN CHAMPIONS TROPHY 2025: (INR).
Winner – 20.8 Cr.
Runner Up – 10.4 Cr.
Semifinalists – 5.2 Cr.
5th & 6th Spots – 3 Cr.
7th & 8th Spots – 1.2 Cr.
For Every Match – 29 Lakhs. pic.twitter.com/AF1DWuEBM0— Tanuj Singh (@ImTanujSingh) February 14, 2025