
మాస్ కా దాస్ విశ్వక్సేన్(Mass Ka Das Vishwak Sen) హీరోగా ఆకాంక్ష శర్మ(Akanksha Sharma) జంటగా నటించిన మూవీ లైలా(Laila). విశ్వక్ తొలిసారి లేడీ గెటప్‌లో నటించిన ఈ మూవీని డైరెక్టర్ రామ్ నారాయణ్(Director Ram Narayan) తెరకెక్కించాడు. సాహు గారపాటి(Sahu Garapati) నిర్మించగా.. లియోన్ జేమ్స్(Leon James) మ్యూజిక్ అందించాడు. ప్రేమికుల రోజు(Valentine’s Day) కానుకగా ఈరోజు థియేటర్లలోకి వచ్చింది ఈ మూవీ. మరి మెకానిక్ రాకీ డిజాస్టర్ తర్వాత విశ్వక్ హిట్ కొట్టాడా? లేడీ గెటప్‌లో అభిమానులను ఏమేరకు ఆకట్టుకున్నాడు? ఆంకాక్ష శర్మ ఫ్యాన్స్ అంచనాలను ఎంత వరకు అందుకుంది? అనేవి తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చూసేయాల్సిందే..
స్టోరీ ఏంటంటే?
తన తల్లి చివరి బహుమతి అయిన “సీత బ్యూటీ పార్లర్”ను నడుపుకుంటూ.. ఓల్డ్ సిటీ లేడీస్ అందరికీ ఫేవరెట్ అయిపోతాడు సోనూ (Vishwak Sen). సోనూ బారి నుంచి తమ భార్యలను కాపాడుకోవడం కోసం భర్తలందరూ నానా ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలో ఆయిల్ అడల్ట్రేషన్ కేసు(Adulteration Case)లో చిక్కుకుంటాడు సోనూ. పోలీసులు, ఓల్డ్ సిటీ ప్రజలు సోనూ కోసం వెతుకుతుంటారు. వాళ్లందరి నుంచి తప్పించుకొని తిరుగుతూ, తనపై పడిన నిందలను తొలగించుకోవడం కోసం మేకప్(Makeup) వేసుకొని “లైలా” (Laila) గా మారతాడు సోనూ. ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేశాడనేది తెరపై చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే..
హీరో లేడీ గెటప్ వేస్తున్నాడు అంటే…ఆ గెటప్ వెనక కారణం ఎంత బలంగా ఉంటే ఆ గెటప్‌కి అంత వర్త్ పెరుగుతుంది. కానీ లైలాలో డైరెక్టర్ ఈ గెటప్ వెనక చెప్పిన కారణం ఏమంత బలంగా లేక పోవడంతో ఆ గెటప్ కోసం విశ్వక్ సేన్(Viswak) ఎంత కష్టపడినా కూడా ఆ కష్టం మొత్తం వృథా అయింది అనే చెప్పాలి. గత మూడునాలుగు సినిమాలుగా అతడి నటనలో స్పార్క్ లోపించింది. డ్యాన్సులు(Dance), ఫైట్స్(Fights) అన్నీ చాలా ఎబ్బెట్టుగా ఉన్నాయి. సెకండ్ ఆఫ్ కూడా ఏ దశలో అంచనాలను అందుకోలేక పోయింది. దాంతో సినిమా ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని ఎదురు చూసే పరిస్థితి చాలా సీన్స్ కలిగించాయని ఫ్యాన్స్ కామెంట్ చేశారు.
ఇక హీరోయిన్ ఆకాంక్ష శర్మకు నటించేందుకు కనీస స్థాయి స్కోప్ లేదు. భిమన్యు సింగ్ (Abhimanyu Singh), బబ్లూ పృథ్వీరాజ్(Babloo Prithiveeraj), కామాక్షీ(Kamakshi)లు తమ తమ పాత్రల్లో మెప్పించడానికి ప్రయత్నించారు. మ్యూజిక్ పరంగా కాస్త పర్వాలేదు. లైలా(Laila)గా విశ్వక్ ఎంటర్ టైన్ చేసే ప్రయత్నం చేశాడు కానీ.. కథలో బలం లేక పోవడమే మైనస్. మూవీ మొత్తం కొన్ని సీన్స్ మినహా ఏ దశలోనూ కొత్తదనం లేదు.
చివరగా.. లవర్స్ డే రోజు వచ్చినా.. ‘లైలా’ స్టోరీలో లైఫ్ మిస్సైనట్లుంది.
రేటింగ్: 1.75/5