ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి మ్యూజికల్ కన్సర్ట్.. ట్రైలర్ చూశారా?

ప్రస్తుతం టాలీవుడ్ మ్యూజిక్ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో కొనసాగుతున్నారు ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి (MM Keeravani). దేవీశ్రీప్రసాద్, తమన్, అనిరుధ్ రవిచందర్ వంటి యంగ్ కంపోజర్లకు మాత్రమే ఇప్పుడు ఛాన్సులు వస్తున్నాయి. అయితే ఈ యంగ్ కంపోజర్లకు సీనియర్ సంగీత దర్శకుడు కీరవాణి టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్ (RRR)’ సినిమాతో ఆస్కార్ గెలుచుకున్న ఆయన ఇప్పటికీ తన ఫామ్ కొనసాగిస్తూనే ఉన్నారు. ఎస్ఎస్ రాజమౌళి తన ప్రతి సినిమాకు కీరవాణినే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకుంటారన్న విషయం తెలిసిందే.

కీరవాణి మ్యూజికల్ కన్సర్ట్

ఇక ఈ లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ యంగ్ కంపోజర్లకు పోటీనిస్తూ సంగీతం చేయడమే కాకుండా కన్సర్ట్ లను కూడా నిర్వహిస్తూ ఉంటారు. కీరవాణి సంగీత కచేరీలంటే చాలా మంది ఇష్టపడుతుంటారు. ఈ మ్యూజిక్ కన్సర్ట్ కు యూత్ మాత్రమే కాకుండా మధ్య వయస్కులు, వృద్ధులు కూడా ఫిదా అవుతుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కీరవాణి మ్యూజిక్ కన్సర్ట్ (MM Keeravani Musical Concert) నిర్వహించాలని నిర్ణయించారు.

మార్చి 22న కీరవాణి కన్సర్ట్

హైదరాబాద్ టాకీస్ (Hyderabad Talkies), మై మ్యూజిక్ మై కంట్రీ సంయుక్తంగా ఈ సంగీత కచేరీని నిర్వహిస్తున్నాయి. మార్చి 22వ తేదీన హైటెక్స్‌లో ఇది జరగనుంది. తాజాగా ఈ మ్యూజికల్ కన్సర్ట్ ట్రైలర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆస్కార్ గెలిచిన తర్వాత కీరవాణి నిర్వహిస్తున్న కన్సర్ట్ ఇదే కావడం విశేషం. చాలా రోజుల తర్వాత కీరవాణి సంగీత కచేరి నిర్వహిస్తుండటంతో దీనికి హాజరవ్వాలని నెటిజన్లు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *