
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు(Harihara Veeramallu)’ సినిమాపై చిత్ర నిర్మాత ఏఎం రత్నం(AM RAtnam) తాజాగా బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుగా చెప్పినట్టు మార్చి 28నే థియేటర్లలోకి తీసుకువస్తామని ఆయన ప్రకటించారు. ఆ దిశగా పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. పవన్-క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ కాంబోలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా నటిస్తుండగా.. MM కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.
అభిమానులు ఫుల్ ఖుషీ
తాజాగా ఇంటర్వ్యూలో ఏఎం రత్నం మాట్లాడుతూ “ఎవరికీ ఎటువంటి ఆందోళన అవసరం లేదు. అనుకున్న సమయానికి మూవీని రిలీజ్ చేస్తాం. పవన్‌కు సంబంధించి మిగిలిన షూటింగ్‌ను కూడా పూర్తి చేస్తున్నాం” అని చెప్పారు. ఇక ప్రేమికుల రోజు సందర్భంగా చిత్రం యూనిట్ కీలక అప్‌డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా సెకండ్ సింగిల్(Second Single) ‘కొల్లగొట్టిందిరో’ అంటూ సాగే రొమాంటిక్ సాంగ్‌ను ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇప్పుడు నిర్మాత మూవీ విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని చెప్పి, అభిమానులను మరింత ఖుషీ చేశారు.