ప్ర‌భాస్ ‘ఫౌజీ’లో ఆలియా భట్.. ఏ పాత్రలో అంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), హను రాఘవపూడి (Hanu Raghavapudi) కాంబోలో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఫౌజీ’ అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉంది. ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ పీరియాడిక్ డ్రామా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మైత్రీమూవీ మేకర్స్ రూపొందిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నట్లు సమాచారం.

సైనికుడిగా ప్రభాస్

స్వాతంత్య్రానికి పూర్వం జరిగే కథతో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ  సినిమాలో ప్రభాస్ బ్రిటీష్‌ సైనికుడిగా కనిపించనున్నాడట. విశాల్‌ చంద్రశేఖర్‌ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన న్యూస్ ఒకటి ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ దివా నటించనున్నట్లు తెలిసింది.

బ్రిటీష్ యువరాణి పాత్రలో ఆలియా

ప్రభాస్ ఫౌజీలో బ్రిటీష్ యువరాణి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ (Alia Bhatt) నటించనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. యువ‌రాణి పాత్ర ఈ సినిమాకే చాలా కీలకమని, అందువల్లే ఆ పాత్రకు టాలెంటెడ్ నటి కావాలని హనూ భావిస్తున్నాడట. ఈ క్రమంలోనే ఆలియా పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ (Anupam Kher) నటిస్తున్న విషయం తెలిసిందే.

ప్రభాస్ చేతిలో ఐదు సినిమాలు

ఇక ప్రభాస్ సినిమాల సంగతికి వస్తే ప్రస్తుతం డార్లింగ్ చేతిలో ఐదు సినిమాలున్నాయి. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో వస్తున్న ‘ది రాజా సాబ్(The Raja Saab)’ సినిమా షూటింగ్ జెట్ స్పీడులో షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఇప్పుడు హను రాఘవపూడితో సినిమా తీస్తున్నాడు. ఇవే కాకుండా ప్రశాంత్ నీల్ తో సలార్ పార్ట్-2, నాగ్ అశ్విన్ తో కల్కి పార్ట్-2, సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ (Spirit) చిత్రాలు చేస్తున్నాడు రెబల్ స్టార్.

Related Posts

కావాలనే కొందరు నన్ను టార్గెట్ చేస్తున్నారు: Pooja Hegde

సౌత్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మనీ ఇచ్చి మరీ తనపై నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ బాంబ్ పేల్చింది. తాజాగా ఈ అమ్మడు కావాలనే కొంతమంది తనపై నెగిటివ్…

చిరు-అనిల్ రావిపూడి సినిమా ముహూర్తం ఫిక్స్

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం వశిష్ఠతో విశ్వంభర (Vishwambhara) సినిమా చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ చిత్రం చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు పనులను అనిల్ పూర్తి చేసినట్లు సమాచారం. అయితే…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *