
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రస్తుతం తన ఫోకస్ అంతా కెరీర్ పైనే పెట్టింది. మయోసైటిస్ వల్ల సినిమాలకు ఒక ఏడాది గ్యాప్ ఇచ్చిన సామ్.. ప్రస్తుతం ఫుల్ ఆన్ వర్క్ మోడ్ లో ఉంది. ఇప్పటికే ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను ప్రకటించింది. తాజాగా ‘రక్త్ బ్రహ్మాండ్’ అంటే వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. హిందీలో తెరకెక్కుతున్న ఈ సిరీస్ లో సమంతతోపాటు ఆదిత్య రాయ్ కపూర్ (Aditya Roy Kapoor), వామికా గబ్బి, అలీ ఫజల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
చిక్కుల్లో సమంత వెబ్ సిరీస్
అయితే ‘రక్త్ బ్రహ్మాండ్ (Rakht Brahmand)’ వెబ్ సిరీస్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డట్టు తెలుస్తోంది. ఈ సిరీస్ షూటింగుకు ఇప్పుడు చిన్న బ్రేక్ పడిందట. 2024 సెప్టెంబరులో షూటింగ్ మొదలుపెట్టిన మేకర్స్.. ఇంకా సిరీస్ కీలక దశకు కూడా చేరుకోకుండానే 50 శాతం బడ్జెట్ ఖర్చు చేశారట. అంతగా ఎందుకు ఖర్చయిందని ఆరా తీస్తే.. ఈ బడ్జెట్ లో బిగ్ స్కామ్ జరిగినట్లు బయటపడిందట. దీని వెనుక ఓ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హస్తం ఉందని గుర్తించిన మేకర్స్ విచారణ జరిపుతున్నారట.
Aditya Roy Kapur, #SamanthaRuthPrabhu and Wamiqa Gabbi will star in period fantasy series ‘RAKHT BRAHMAND’.
Rahi Anil Barve (‘Tumbbad’) is set to direct, filming begins in August.
(via https://t.co/xCrOVf54o9) pic.twitter.com/3nNJZMvzVB
— justSP 🍿☉ (@SakshamPateria) July 20, 2024
దానివల్లే డబ్బంతా దుబారా
నెట్ ఫ్లిక్స్ (Netflix), డి2ఆర్ సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న ఈ హార్రర్ ఫాంటసీ సిరీస్ ఇప్పటిదాకా కేవలం 26 రోజులు మాత్రమే షూటింగ్ జరుపుకుందని సమాచారం. ఇంకా చాలా షూటింగ్ బ్యాలెన్స్ ఉందట. ఈ సిరీస్ ను ది ఫ్యామిలీ మ్యాన్ ఫేం.. రాజ్ అండ్ డీకే పర్యవేక్షిస్తున్నారు. దర్శకుడు రహి అనిల్ బర్వే సెట్స్‌లో అప్పటికప్పుడు చేస్తున్న మార్పులు చేర్పుల వల్ల నిర్మాణ వ్యయం పెరుగుతోందనే టాక్ వినిపిస్తోంది.