
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే పుష్ప-2 (Pushpa 2) సినిమాతో బాక్సాఫీస్ వద్ద రఫ్ఫాడించాడు. రికార్డు స్థాయి కలెక్షన్లతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక పుష్ప-2 తర్వాత బన్నీ (Allu Arjun) త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేయనున్నట్లు టాక్ వినిపించింది. కానీ ఈ సినిమా కాస్త ఆలస్యమయ్యేలా ఉందని ఇటీవల వార్తలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ తమిళ్ డైరెక్టర్ అట్లీతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు న్యూస్ చక్కర్లు కొడుతోంది.
ఐకాన్ స్టార్ తో దేవర బ్యూటీ
ఇక అల్లు అర్జున్, అట్లీ (Atlee) సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయినట్టు ఇప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ చిత్రంలో నటించనున్నట్లు సమాచారం. హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో బన్నీ సరసన జాన్వీని (Janhvi Kapoor) ఫిక్స్ చేసినట్లు ప్రచారం నడుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదే నిజమైతే జాన్వీ.. ముగ్గురు పాన్ ఇండియా స్టార్లతో నటించినట్లవుతుంది.
Hey 💋✨ pic.twitter.com/frX8RJDI4P
— Janhvi Kapoor (@janhvikapoorr) February 9, 2025
ముచ్చటగా మూడో సినిమా
ఇప్పటికే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR)తో దేవర సినిమాలో జాన్వీ కపూర్ నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉప్పెన ఫేం బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న సినిమాలోనూ ఈ బ్యూటీ నటిస్తోంది. ఇక ఇప్పుడు మరో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ తో సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ‘పరమ్ సుందరి’ మూవీలో నటిస్తోంది.
కావాలనే కొందరు నన్ను టార్గెట్ చేస్తున్నారు: Pooja Hegde
సౌత్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మనీ ఇచ్చి మరీ తనపై నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ బాంబ్ పేల్చింది. తాజాగా ఈ అమ్మడు కావాలనే కొంతమంది తనపై నెగిటివ్…