
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha), బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ కీలక పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘సిటడెల్ : హనీ బన్నీ’ (Citadel: Honey Bunny). అమెజాన్ ప్రైమ్ వేదికగా రిలీజ్ అయిన ఈ సిరీస్ లో సామ్ నటనకు మంచి ప్రశంసలు లభించాయి. కానీ ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లాగా.. ఈ సిరీస్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయినా ఇందులో సమంత, వరుణ్ (Varun Dhawan) నటనకు మంచి మార్కులే పడ్డాయి.
సిటాడెల్ కు ఐకానిక్ గోల్డ్
మరోవైపు ఈ వెబ్‌సిరీస్‌కు పలు అవార్డులు కూడా లభించాయి. తాజాగా సిటాడెల్ వెబ్ సిరీస్ ఐకానిక్ గోల్డ్ అవార్డ్స్(Iconic Gold Awards 2025)లో ఉత్తమ వెబ్‌సిరీస్‌గా నిలిచింది. ఐకానిక్ గోల్డ్ అవార్డును ఈ సిరీస్ అందుకుంది. ఈ సందర్భంగా సిరీస్ దర్శక ధ్వయంలో ఒకరైన డీకే సంతోషం వ్యక్తం చేశారు. సినిమా, వెబ్‌సిరీస్ తీయడం వెనుక చాలా మంది కృషి ఉందని ఆయన చెప్పారు. సిటాడెల్ వెబ్ సిరీస్ కు అవార్డుల రూపంలో చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు.
“Congratulations to Citadel: Honey Bunny for winning Best Web Series!🏆 🎬🔥
From Raj & DK and the Russo Brothers’ AGBO, this thrilling series has captivated audiences with its intense action and gripping storyline! 💥🎭@rajndk@PrimeVideoIN#IconicGoldAwards2025 pic.twitter.com/kSRoXCtBIO— Iconic Gold Awards (@IconicGoldAward) February 18, 2025
అమెజాన్ లో సిటాడెల్
రాజ్ అండ్ డీకే (Raj And DK) దర్శకత్వం వహించిన సిటాడెల్ వెబ్ సిరీస్ మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా సమంత, వరుణ్‌ల నటన, యాక్షన్ సన్నివేశాలు సిరీస్‌కు హైలైట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ‘ఫ్యామిలీ మ్యాన్’, ‘ఫర్జీ’ వంటి విజయవంతమైన సిరీస్‌లతో అలరించిన రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ఈ స్పై థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా అందుబాటులో ఉంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది.