ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy) తొలి పోరులో టీమ్ఇండియా(Team India) దుమ్మురేపింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో బంగ్లాను చిత్తు చేసింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో బంగ్లాదేశ్(Bangladesh)పై 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. 229 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్(Rohit), గిల్(Gill) శుభారంభం అందించారు. కెప్టెన్ రోహిత్ 41, విరాట్ కోహ్లీ 22, కేఎల్ రాహుల్ 41 రన్స్‌తో రాణించారు. యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (101) సెంచరీతో చెలరేగాడు. దీంతో భారత్ విజయం సులవైంది. సూపర్ సెంచరీ చేసిన గిల్‌కు “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్: అవార్డు దక్కింది. కాగా వన్డేల్లో గిల్‌కి ఇది 8వ సెంచరీ కావడం విశేషం.
బంగ్లా బ్యాటర్లలో ఆ ఇద్దరే..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ భారత్ స్పీడ్ గన్ షమీ(Shami) దెబ్బకు 8.3 ఓవర్లకే 35 రన్స్ చేసి 5 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో తౌహిద్ హృదయ్(Towhid Hridoy) 118 బంతుల్లో 100 పరుగులతో ఆ జట్టును ఆదుకున్నాడు. అతడికి జాకీర్ అలీ(Jakir ALi) 68 రన్స్‌తో సహకారం అందించగా.. మిగతా బ్యాటర్లు అందరూ చేతులెత్తేశారు. దీంతో 49.4 ఓవర్లలో 228 పరుగులకే బంగ్లా ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో మహ్మద్ షమి అద్భుత ప్రదర్శనతో ఐదు వికెట్లు తీసి బంగ్లాదేశ్‌ను కట్టడి చేశాడు. హర్షిత్ రాణా మూడు, అక్షర్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టారు.
THE KL RAHUL FINISH. 🚀#ChampionsTrophy2025 #INDvBAN pic.twitter.com/7DRKLG68yC
— The King 🦁 (@Thekingg077) February 20, 2025
కాగా భారత్ తన తర్వాతి మ్యాచ్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్(Pakistan)తో ఫిబ్రవరి 23న తలపడనుండగా.. బంగ్లాదేశ్ 24న న్యూజిలాండ్(NZ)తో ఆడనుంది. ఇక ఇవాళ గ్రూప్-బిలోని జట్ల సమరం మొదలుకానుంది. అఫ్గానిస్థాన్(AFG)తో సౌతాఫ్రికా(SA) తలపడనుంది. కరాచీ వేదికగా జరిగే ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమవుతుంది.






