మా అమ్మ ఆరోగ్యంగా ఉన్నారు.. అంజనాదేవి హెల్త్ పై ‘మెగా’ అప్డేట్

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మాతృమూర్తి అంజనాదేవి ఆరోగ్యంపై ఇవాళ పలు వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆమె హైబీపీతో ఆస్పత్రిలో చేరారంటూ పలు మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. అయితే ఈ వార్తలపై మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. తన మాతృమూర్తి అంజనాదేవి (Anjana Devi) సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. ఆమె అస్వస్థతకు గురయ్యారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని చెబుతూ.. ఆయన ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు.

అవాస్తవాలు రాయొద్దు

“మా అమ్మ ఆరోగ్యం సరిగా లేదని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని కొన్ని వార్తలు వచ్చినట్లు నా దృష్టికి వచ్చింది. ఈ విషయంపై నేను క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను. రెండు రోజులుగా ఆమె ఒంట్లో కాస్త నలతగా మాత్రమే ఉంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉన్నారు.  ఆమె ఆరోగ్యానికి సంబంధించి, దయచేసి ఊహాజనిత వార్తలను ప్రచురించవద్దు. ఈ విషయంలో నేను మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నా. అవాస్తవాలు ప్రచారం చేయకండి. మీరంతా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. అంటూ చిరంజీవి ఎక్స్ లో పోస్టు పెట్టారు.

అమ్మ ఆరోగ్యంగా ఉంది

ఇక అంజనాదేవి ఆరోగ్యంపై ఉదయం నుంచి సోషల్ మీడియాలో వార్తలు రావడంతో పలు మీడియా సంస్థలు కూడా ఈ వార్తలను ప్రచురించాయి. ఈ నేపథ్యంలో దీనిపై చిరంజీవి టీమ్‌ ఇప్పటికే క్లారిటీ ఇస్తూ.. సాధారణ ఆరోగ్య పరీక్షల్లో భాగంగా మాత్రమే ఆమెను గత వారం ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు తెలిపింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని వివరించింది. తాజాగా చిరంజీవి కూడా ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడంతో అంజనాదేవి ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలకు తెరపడింది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *