గత కొంత కాలం పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు(Gold Rates).. రెండ్రోజుల క్రితం కాస్త తగ్గి వినియోగదారులకు ఊరటినిచ్చాయి. దీంతో శుభకార్యాల సమయం కావడంతో కొనుగోలుదారులు(Buyers) పసిడి దుకాణాలకు పరుగులు పెడుతున్నారు. మళ్లీ ఏ క్షణం ఎంత పెరుగుతుందోననే భయంతోనే ఉన్నంతలో కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ (మార్చి 3) బంగారం ధరల్లో ఎలాంటి తేడా లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి.
హైదరాబాద్(Hyderabad)లో ఇవాళ 22 క్యారెట్స్ 10 గ్రాముల పసిడి ధర రూ. 79,400 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేటు విషయానికి వస్తే.. 10 గ్రాములకు రూ. 86,620 వద్ద ఉంది. ఇక వెండి ధరలు(Silver Rates) కూడా స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 1,05,000పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల్లోనూ దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
పతనమవుతోన్న రూపాయి విలువ
ఇక రూపీ వ్యాల్యూ(Rupee Value) మాత్రం రోజురోజుకూ పతనమవుతోంది. దీంతో ఇవాళ ఒక US డాలర్‌కు రూ.87.47గా రూపాయి విలువ ఉంది. అటు దేశీయ స్టాక్‌మార్కెట్లు(Stock Markets) ఫ్లాటుగా ట్రేడవుతున్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడం, అంతర్జాతీయ అనిశ్చితే ఇందుకు కారణాలు. Nifty 22,103 (-21), Sensex 73,096 (-102) వద్ద కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి సేల్స్ డేటా మెరుగ్గా ఉండటంతో ఆటో షేర్లు(Auto Shares) పుంజుకున్నాయి.







