
బాలీవుడ్ స్టార్ నటుడు విక్కీ కౌశల్(Vicky Kaushal), డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్(Laxman Utekar) కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘ఛావా(Chhaava)’. మరాఠా యోధుడు శంభాజీ మహారాజ్(Shambhaji Maharaj) జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ గత ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ అయిన డే వన్ నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఛావా మూవీ కాసుల వర్షం కురిపిస్తోంది.
మార్చి 7న తెలుగులో..
మడాక్ ఫిల్మ్స్ పతాకంపై దినేశ్ విజన్ నిర్మించిన ఈ సినిమాలో రష్మిక మందన్న(Rashmika Mandanna) కథానాయికగా నటించింది. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ రిలీజ్ అయింది. కాగా ఈ మూవీని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్(Geetha Arts) మార్చి 7న తెలుగులో రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంకెందుకు ఆలస్యం ‘ఛావా తెలుగు ట్రైలర్(Chhaava Telugu Trailer)’ని మీరూ చూసేయండి..