అల్లు అర్జున్-అట్లీ సినిమాలో మరో హీరో?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఇటీవలే పుష్ప-2 : ది రూల్ (Pushpa 2 : The Rule) సినిమాతో ప్రభంజనం సృష్టించాడు. ఈ సినిమా దాదాపు రూ.1800 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక ఇంతటి భారీ హిట్ తర్వాత బన్నీ చేసే సినిమాపై మరింత అంచనాలు ఉండటం సాధారణం. ఈ నేపథ్యంలోనే ఈ హీరో తన నెక్స్ట్ సినిమా విషయంలో కాస్త ఆచితూచి ప్రవర్తిస్తున్నాడు. బన్నీ-త్రివిక్రమ్ (Trivikram) కాంబోలో ఓ సినిమా కన్ఫామ్ అయినట్లు మొదట్లో టాక్ వినిపించింది. అయితే ఈ సినిమాకు బ్రేక్ పడినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.

బన్నీతో పాటు మరో హీరో

పుష్ప-2 తర్వాత బన్నీ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ (Atlee)తో సినిమా చూసేందుకు మొగ్గు చూపినట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక జవాన్ మూవీతో బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చిన అట్లీ కూడా తన తదుపరి చిత్రం పాన్ ఇండియా హీరోతో తీయాలని భావిస్తున్నాడట. ఈ క్రమంలో అల్లు అర్జున్-అట్లీ కాంబో కన్ఫామ్ అయిందని టాక్. అయితే ఈ సినిమాలో బన్నీతో పాటు మరో హీరో కూడా ఉన్నాడట. అయితే అతడు టాలీవుడ్, బాలీవుడ్ హీరో కాదట. తమిళ్ హీరో అంట. కానీ అతడెవరో మాత్రం కన్ఫామ్ కాలేదు.

ముగ్గురు హీరోయిన్లు

ఇక అల్లు అర్జున్-అట్లీ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉండనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందులో ఓ బ్యూటీని ఆల్రెడీ లాక్ చేసినట్లు సమాచారం. దేవర మూవీతో టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చిన బీ టౌన్ భామ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా కన్ఫామ్ అయిందట. ఈ సినిమాకు లేటెస్ట్ సెన్సేషన్ అభయంకర్ మ్యూజిక్ అందించనున్నాడు. ఇక అట్లీ, అల్లు అర్జున్ కాంబో ఊరమాస్ గా ఉండబోతుందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. మరి ఈ సినిమా గురించి త్వరలోనే అధికారిక ప్రకటన, నటీనటులను మేకర్స్ ప్రకటించనున్నట్లు తెలిసింది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *