ఈనెల 27వ వరకు అసెంబ్లీ సమావేశాలు.. 19న తెలంగాణ బడ్జెట్

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు (Telangana Budget Session 2025) గురువారానికి వాయిదా పడ్డాయి. అనంతరం శాసనసభాపతి గడ్డం ప్రసాద్​ కుమార్​ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ భేటీలో రాష్ట్ర బడ్జెట్, అసెంబ్లీ సమావేశాలపై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో మార్చి 19వ తేదీన రాష్ట్ర బడ్జెట్ (Telangana Budget 2025-26)​ను ప్రవేశపెట్టాలని తీర్మానం చేశారు. మరోవైపు ఈనెల 27వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.

శాసనసభ భవనంలోని స్పీకర్ ఛాంబర్‌లో ప్రారంభమైన బీఏసీ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రులు హరీష్ రావు (Harish Rao), ప్రశాంత్ రెడ్డి, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య, సీపీఐ నుంచి కూనమనేని సాంబశివరావు హాజరయ్యారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *