టాలీవుడ్ స్టార్ నాని(Nani) వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్స్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘కోర్ట్’: స్టేట్ వర్సెస్ ఏ నోబడీ(‘Court’: State vs. A Nobody)’. ప్రియదర్శి(Priyadarshi) ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం తెరకెక్కించాడు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించగా.. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీ ప్రిమియర్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మార్చి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ చిత్రంలో ‘మంగపతి(Mangapathi)’ పాత్ర పోషించిన యాక్టర్ శివాజీ(Shivaji) ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విశేషాలు షేర్ చేసుకున్నారు.

బుల్లితెర నుంచి బిగ్ స్క్రీన్ వరకూ..
టాలీవుడ్ యాక్టర్ శివాజీ సినీ అభిమానులకు సుపరిచితమే. బుల్లితెర నుంచి బిగ్ స్క్రీన్ మీదకు వచ్చిన నటుల్లో అతను ఒకరు. క్యారక్టర్ ఆర్టిస్టు(Character artistt)గా కెరీర్ ప్రారంభించిన శివాజీ.. హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. రీఎంట్రీలో 90s వెబ్ సిరీస్‌తో సూపర్ హిట్ అందుకున్న ఆయన.. తాజాగా కోర్టు మూవీలోనూ తన నటవిశ్వరూపం చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కోర్ట్’ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న అద్భుతమైన స్పందన చాలా అనందాన్ని ఇచ్చింది. నా 25 ఏళ్ల కల ‘మంగపతి’ పాత్రతో నెరవేరింది’ అని శివాజీ పేర్కొన్నాడు.
మంగపతి పాత్ర నా కోసమే పుట్టింది..
అంతేకాదు ‘మంగపతి పాత్ర నా కోసమే పుట్టిందని భావిస్తున్నాను. ఈ పాత్రలో సహజమైన భావోద్వేగం ఉంది. ప్రతి కుటుంబంలో ఇలాంటి స్వభావమున్న వ్యక్తి ఉంటారు. నాని నటుడిగా నిరూపించుకొని, ఇప్పుడు నిర్మాత(Producer)గానూ రాణిస్తున్నారు. కొత్త నటీనటులను ప్రోత్సహించడంలోనూ చొరవ చూపిస్తున్నారు. కోర్ట్ సినిమా బాగోకపోతే తన ‘హిట్ 3’ చిత్రాన్ని చూడొద్దంటూ సవాలు విసరడం మామూలు విషయం కాదు’ అని శివాజీ తెలిపాడు.






