
పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. ఒకరోజు బంగారం ధర (Gold Price) స్వల్పంగా తగ్గుతుంది. హమ్మయ్య మరో రెండ్రోజులు చూస్తే మరింత తగ్గుతుందని అనుకునేలోగానే అనుకోకుండా భారీగా ధరలు పెరుగుతున్నాయి. ఇక తాజాగా పసిడి ధరలు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి ఎగబాకాయి. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో పుత్తడి ధరలు జీవన కాల గరిష్టాల్ని చేరుకున్నాయి.
బంగారం ధర
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీసుకుంటున్న దిగుమతి సుంకం నిర్ణయాలు, ప్రతీకార సుంకాలతో అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి పెంచుతున్నాయి. ఫలితంగా పుత్తడి ధరలు భారీగా పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా గోల్డ్ రేట్లు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి తాకాయి. హైదరాబాద్ నగరంలో ఒక్కరోజులోనే 24 క్యారెంట్ల బంగారంపై రూ.1200 పెరిగింది. ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ.89,780 వద్దకు చేరింది. మరోవైపు 22 క్యారెట్ల పసిడి ధర రూ.1100 పెరగడంతో తులం బంగారం ధర రూ.82,300 వద్ద పలుకుతోంది.
నేటి వెండి ధర
ఇక ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.82,450య.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.89,930 వద్దకు చేరింది. మరోవైపు వెండి ధరలు కూడా ఆకాశానికి ఎగబాకుతున్నాయి. ఇప్పటికే సిల్వర్ రేట్లు (Silver Price Today) లక్ష రూపాయలపైకి చేరింది. ఢిల్లీలో ప్రస్తుతం కేజీ సిల్వర్ రేటు రూ. 2 వేలు పెరిగి రూ. 1.03 లక్షలకు చేరింది. ఇక హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 2000 పెరగడంతో ప్రస్తుతం రూ. 1.12 లక్షల వద్ద అమ్ముడుపోతోంది.