భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్(Sunita Williams), బుచ్ విల్మోర్(Butch Wilmore) సుధీర్ఘ కాలం తర్వాత భూమికి చేరిన విషయం తెలిసిందే. స్పేస్ ఎక్స్(Spece X) వ్యోమనౌక ‘క్రూ డ్రాగన్(Crew Dragon)’లో సునీత, బుచ్ విల్మోర్‌లను తిరిగి సురక్షితంగా భూమిపైకి తీసుకొచ్చింది. ఫ్లోరిడాలోని సముద్రంలో ల్యాండ్ అయిన అనంతరం స్పేస్ షిప్ నుంచి సునీతతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములను NASA అధికారులు వైద్య పరీక్షల కోసం తరలించారు. ఈ సందర్భంగా మరో సేఫ్ ల్యాండింగ్ నిర్వహించిన స్పేస్ ఎక్స్, నాసా బృందాలకు ఎలాన్ మస్క్(Elon Musk) అభినందనలు తెలిపారు.
అప్పట్లోనే ప్రతిపాదన చేశాం: మస్క్
ఈ సందర్భంగా స్పేస్ ఎక్స్ ఫౌండర్ ఎలాన్ మస్క్(Elon Musk) మాట్లాడారు. ISSలో చిక్కుకుపోయిన వ్యోమగాములను వెనక్కి తీసుకురావడానికి తమ కంపెనీ తరఫున బైడెన్(Biden) ప్రభుత్వానికి అప్పట్లోనే ప్రతిపాదన చేశామన్నారు. సునీత, బుచ్‌లను తీసుకువచ్చేందుకు మరో వ్యోమనౌక(Spaceship)ను పంపిస్తామని బైడెన్‌కు ఆఫర్ ఇచ్చామన్నారు.

NASA, Spece X సిబ్బందికి అభినందనలు
అయితే రాజకీయ కారణాల(Political Reasons)తో ఆయన తిరస్కరించారని మస్క్ ఆరోపించారు. తమ ఆఫర్‌కు బైడెన్ అంగీకారం తెలిపి ఉంటే వారు ఇంతకాలం ISSలోనే ఉండిపోయే అవసరం ఉండేదన్నారు. ఏదేమైనా సునీత, బుచ్ విల్మోర్‌లు క్షేమంగా భూమికి తిరిగి రావడం సంతోషకరమని మస్క్ చెప్పారు. ఈ ఆపరేషన్‌కు కృషి చేసిన NASA, Spece X సిబ్బందికి మస్క్ అభినందనలు తెలియజేశారు.
— Elon Musk (@elonmusk) March 19, 2025








