
మరోసారి గాజా(Gaza)పై ఇజ్రాయెల్(Israel) భీకర దాడులు కొనసాగిస్తోంది. హమాస్(Hamas) బందీలను విడుదల చేయకపోవడం, USA మధ్వర్తిగా ప్రతిపాదనలను తిరస్కరించడంతో ఇజ్రాయెల్ సైన్యం మరోసారి గాజాపై విరుచుకుపడుతోంది. దీంతో గత 3 రోజుల్లో జరిపిన దాడుల్లో దాదాపు 400 మందికిపైగా మృతిచెందారు. వందలాది మంది గాయపడ్డారు. తాజాగా బుధవారం (మార్చి19) రాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడు(Air Strikes)ల్లో 14 మంది చనిపోయారు. ఈ క్రమంలో గాజాలో ప్రస్తుత పరిస్థితిపై భారత్(India) ఓ కీలక ప్రకటన విడుదల చేసింది.
గాజాకు తక్షణ నిరంతర సాయం అవసరం: భారత్
గాజాలో బందీలుగా ఉన్న వారందరినీ విడుదల చేయాలని భారత్(India) పిలుపునిచ్చింది. గాజా ప్రజలకు ప్రస్తుతం నిరంతర మానవతా సహాయం(Humanitarian aid) అవసరమని పేర్కొంది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి రణధీర్ జైస్వాల్(Randhir Jaiswal) Xలో పోస్ట్ షేర్ చేశారు. గాజాలో పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్నాం. అక్కడి బందీలందరినీ(All the captives) విడుదల చేయడం చాలా అవసరం. గాజా ప్రజలకు నిరంతరం మానవతా సహాయం అందించాలని మేం కోరుతున్నామని అని జైస్వాల్ Xలో పోస్ట్ రాశారు.
ఎవరూ తగ్గట్లే.. ఇద్దరూ ఇద్దరే
ఇదిలా ఉండగా గాజాపై దాడులు మరింత ఉద్ధృతం చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. హమాస్, ఇస్లామిక్ జిహాద్ ఉగ్రవాద(Islamic Jihad terrorism) కార్యకలాపాలలో ఉపయోగించే నౌకలను లక్ష్యంగా గాజా తీరం వెంబడి దాడులు చేస్తామని పేర్కొంది. అటు ఇజ్రాయెల్‌పై దాడులు చేసేందుకు వెనకాడబోమని, చర్యకు ప్రతిచర్య తప్పక ఉంటుందని హమాస్ హెచ్చరించింది.