నాసా వ్యోమగామి, భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ (Sunita Williams), మరో ఆస్ట్రోనాట్ బుచ్ విల్మోర్ (Butch Wilmore) ఎట్టకేలకు భూమిని చేరారు. నాసా క్రూ డ్రాగన్ స్పేస్ ఫ్లైట్(NASA Crew Dragon spaceflight) వారిని సురక్షితంగా భూమికి తీసుకొచ్చింది. వారితోపాటూ.. మరో ఇద్దరు ఆస్ట్రోనాట్స్ కూడా తిరిగి భూమికి వచ్చారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి బయల్దేరిన క్రూ డ్రాగన్ స్పేస్ ఫ్లైట్.. బుధవారం తెల్లవారుజామున 3:27కి ఫ్లోరిడా(Forida) సముద్ర తీరానికి దగ్గర్లోని సముద్ర జలాల్లో దిగింది. ఇలా 9 నెలల నిరీక్షణ తర్వాత.. ISS నుంచి సునీతా భూమిని చేరుకోవడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
The most beautiful footage you’ll see today!
All four astronauts have safely returned to Earth. #sunitawilliamsreturn #SunitaWilliams pic.twitter.com/RHQPgzekF3— Suzanne (@Ssuzannnee) March 18, 2025
గంటకు 17 వేల మైళ్ల వేగంతో..
కాగా డ్రాగన్ క్యాప్సుల్.. గంటకు 17 వేల మైళ్ల (27358KM) వేగంతో భూమివైపు పయనించింది. ఈ వేగంతో సముద్ర జలాల్లో దిగితే సముద్రం లోపలికి దూసుకుపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల భూమికి దగ్గరయ్యే కొద్దీ క్రమంగా వేగాన్ని తగ్గిస్తూ వచ్చారు. భూమికి చేరువైన సమయంలో.. గంటకు 116 మైళ్ల (186KM) వేగానికి తగ్గించారు. ఆ తర్వాత 4 పారాచూట్లు ఓపెన్ చేశారు. దీంతో క్యాప్సుల్ చక్కగా సముద్ర నీటిలో దిగింది.
Sunita Williams Space Craft landed safely at 5:57pm EST in Tallahassee Florida!
Later they will be taken to Houston space station facility!#sunitawilliamsreturn #SpaceX #dragon #Florida pic.twitter.com/RvcPP7H9q0
— North East West South (@prawasitv) March 18, 2025
జాన్సన్ స్పేస్ సెంటర్‌కు నలుగురు వ్యోమగాములు
అప్పటికే అక్కడ వారి కోసం ఎదురుచూస్తున్న నాసా(NASA) టీమ్.. చిన్న చిన్న బోట్లతో క్యాప్సుల్‌ని చేరుకుంది. ఆ తర్వాత అందరూ కలిసి.. దాన్ని ఒక నౌక లోకి ఎక్కించి సముద్ర తీరానికి తీసుకొచ్చారు. వెంటనే వారిని హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్(Johnson Space Center in Houston)కు తరలించారు. అక్కడ వారికి ఆరోగ్య పరీక్షలు చేసి, కొన్ని రోజుల పాటూ అక్కడే ఉంచుతారు. తద్వారా వారు భూమి ఆకర్షణ శక్తి(Earth is the force of attraction)కి అనుగుణంగా మారేలా చేస్తారు.
The most beautiful footage you’ll see today!
All four astronauts have safely returned to Earth. ❤️ #sunitawilliamsreturn #SunitaWilliams #सुनिता_विलियम्स— Devesh Dubey (@DeveshDubey__) March 18, 2025








